విక్రమ్‌ డేట్‌ ఫిక్స్... కమల్‌ ఫ్యాన్స్ ను ఊరిస్తున్న 'పార్టీ' సెంటిమెంట్‌

Update: 2022-03-31 03:30 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్‌ వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని ఈయన సరైన సాలిడ్ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుని ఎంత కాలం అయ్యింది.. కమల్‌ చివరి సూపర్ హిట్‌ మూవీ ఏది అంటే ఆయన అభిమానులు సైతం ఠక్కున సమాధానం చెప్పలేరు అనడంలో సందేహం లేదు. ఆయన సుదీర్ఘ కాలంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ను రాబట్టేందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నాడు. ఈ సమయంలో రాబోతున్న విక్రమ్‌ సినిమా అంచనాలు పెంచుతోంది.

విక్రమ్‌ సినిమాకు చాలా చాలా పాజిటివ్‌ వైబ్స్ ఉన్నాయి. అభిమానులు పలు రకాలుగా పాజిటివ్‌ సెంటిమెంట్స్ ను చెప్పుకుంటున్నారు. ప్రథానంగా ఈ సినిమాకు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌. ఈయన దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా ఆయనకు మరో విజయాన్ని ఖచ్చితంగా సాధించి పెడుతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఇక విక్రమ్‌ సినిమా లో కేవలం కమల్‌ హాసన్‌ మాత్రమే కాకుండా మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ అండ్ క్రేజీ స్టార్స్ అయిన విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాజల్‌ లు నటించారు. వీరిద్దరు కలిసి కమల్‌ తో పోటీ పడి నటిస్తే ఖచ్చితంగా అభిమానులు మరియు సాదారణ సినీ ప్రేక్షకులు అలా కళ్లు వెళ్లబెట్టి చూడాల్సిందే. ఈ ముగ్గురిని ఎప్పుడెప్పడు వెండి తెరపై చూస్తామా అంటూ ఆసక్తిగా ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఎదురు చూస్తున్నారు.

ఆ ముగ్గురి వల్ల ఖచ్చితంగా విక్రమ్‌ సినిమా సౌత్‌ లోని అన్ని భాషల్లో విపరీతమైన బజ్‌ ను క్రియేట్‌ చేసింది అనడంలో సందేహం లేదు. మరో వైపు కమల్‌ అభిమానులు మక్కల్ నీది మైయం పార్టీ సెంటిమెంట్‌ ను కూడా నమ్ముకున్నారు. కమల్‌ హాసన్‌ రాజకీయ పార్టీ మక్కల్ నీది మైయం ఏర్పాటు చేసిన తర్వాత బిగ్‌ బాస్ తో సక్సెస్ అయ్యాడు. పార్టీ ఏర్పాటు తర్వాత వస్తున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

పార్టీ ప్రారంభం తర్వాత కమల్‌ బుల్లి తెరపై సక్సెస్ అయ్యాడు కనుక వెండి తెరపై కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మరియు ఎంజీఆర్ లు పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యారు. కనుక కమల్‌ హాసన్‌ కూడా ఖచ్చితంగా పార్టీ ప్రారంభించిన తర్వాత చేస్తున్న మొదటి సినిమా అవ్వడం తో అభిమానులు చాలా స్పెషల్‌ గా ఫీల్ అవుతున్నారు.

ఈ స్పెషల్‌ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న అభిమానుల కోసం డేట్‌ ను ప్రకటించారు. జూన్‌ 3వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. కమల్‌ అభిమానులు ఆయన నుండి ఆశిస్తున్న సాలిడ్ సక్సెస్ విక్రమ్‌ తో దక్కేనా చూడాలి.
Tags:    

Similar News