దీపిక తలపై కమల్ కామెంట్స్

Update: 2017-11-21 04:15 GMT
ఓ సినిమా రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కోవడంపై.. మన దేశంలో కమల్ హాసన్ కంటే బహుశా ఎక్కువగా ఎవరూ చెప్పలేకపోవచ్చు. ఎన్నో సినిమాలలో వివాదాస్పద అంశాలను టచ్ చేసిన ఈ లోకనాయకుడు.. ఇప్పటికీ అదే పంథాను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా రాజకీయాల్లోకి వస్తూ కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతున్నాడు.

ఇప్పుడు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మూవీ దీపికా పదుకొనే నటించిన పద్మావతి. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా.. వివాదాల కారణంగా వాయిదా పడింది. అంతేకాదు.. దర్శకుడు భన్సాలీ .. హీరోయిన్ దీపిక తలకు వెల కూడా కట్టేశారు. దీపికా పదుకొనే తలను నరికి తెచ్చిన వారికి 5 కోట్లిస్తామని కొందరంటే.. 10 కోట్లిస్తామని మరి కొందరు పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేసేయడం దారుణమైన విషయం. ఇప్పుడీ టాపిక్ పై కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు. మిస్ దీపిక తలను రక్షించాల్సి ఉందని అన్న కమల్.. ఆమె శరీరం కంటే తలకు ఎక్కువ గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

'ఆమె స్వేచ్ఛను గౌరవించాలి. దాన్ని ఖండించే హక్కు ఎవరికీ లేదు. చాలా సామాజిక వర్గాలు నా సినిమాలను వ్యతిరేకించాయి. ఏ అంశంలో అయినా అతివాదం కరెక్ట్ కాదు. ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకూ చాలానే మాట్లాడాం. వింటున్నావా భారతమాతా' అంటూ ట్వీట్ చేశారు కమల్ హాసన్.


Tags:    

Similar News