`బాహుబలి 2` ఐదేళ్ల రికార్డును బ్రేక్ చేస్తాడా?
నేటివిటీ ఫీల్ తో తంబీలు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే. అయితే అలాంటి చోట కూడా మన బాహుబలిదే హవా. బాహుబలి 2 ఐదేళ్లుగా అక్కడ నంబర్ వన్ స్థానంలో సుస్థిరంగా బాక్సాఫీస్ రికార్డుల్లో నిలిచి ఉంది. అయితే ఇన్నాళ్టికి ప్రభాస్ నెలకొల్పిన ఈ రికార్డును విశ్వనటుడు కమల్ హాసన్ బ్రేక్ చేయబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.
కమల్ హాసన్ భారతీయ సినిమా లెజెండరీ నటులలో ఒకరు. పెద్దతెర నటుడిగా తనవైన అసాధారణ ప్రదర్శనలతో షో స్టాపర్ గా నిలుస్తుంటారు. కెరీర్ లో కొన్ని చిరస్మరణీయ చిత్రాలను అందించడమే కాకుండా 50 సంవత్సరాలకు పైగా తన కెరీర్ లో అనేక బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాడు. 67 ఏళ్ల వయసులోనూ కమల్ అంతే హుషారుగా నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల విడుదలైన విక్రమ్ తో అతడు రికార్డులు బ్రేక్ చేస్తూ ఊహించని ఆరాని క్రియేట్ చేశాడు. ఈ సినిమా తమిళనాడులో 8 రోజుల రన్ లో 110 కోట్లు వసూలు చేసింది. 100 కోట్ల క్లబ్ లో చేరింది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రంలో మునుముందు రికార్డులు తిరగరాయనుందని భావిస్తున్నారు. `బాహుబలి 2: ది కన్ క్లూజన్` సృష్టించిన 5 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టనుందని.. మరో వారంలో ఈ చిత్రం తమిళనాడు మార్కెట్ లో ఆల్ టైమ్ ఉత్తమ గ్రాసర్ గా ఉద్భవించడానికి EPIC బాహుబలి 2తో పోటీపడనుందని కథనాలొచ్చాయి. ప్రస్తుతం బాహుబలి 2 తమిళనాడులో 155 కోట్ల జీవితకాల కలెక్షన్ లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత విజయ్ నటించిన బిగిల్ రూ. 141 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
శని ఆదివారాలతో విక్రమ్ రూ. రూ. 130 కోట్ల మార్క్ తో తమిళనాడులో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగవ చిత్రంగా అవతరించింది. బుధవారం నాటికి బిగిల్ రికార్డును సవరిస్తూ తమిళనాడు రాష్ట్రంలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా రెండో స్థానాన్ని (BB 2 తర్వాత) అందుకోనుందని అంచనా. అక్కడి నుండి బాహుబలి 2 రికార్డును ఛేజ్ చేసే ప్రయాణం ప్రారంభమవుతుంది. తమిళ ప్రేక్షకుల ఆదరణ బాక్సాఫీస్ ట్రెండ్ ను బట్టి మూడవ వారాంతంలో ఈ చిత్రం ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు.
ఇన్నాళ్లకు తమిళనాడులో తలమానికమైన రికార్డు కమల్ కి దక్కే ఛాన్స్ ఉంది. నిజానికి బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టడానికి 5 సంవత్సరాలు పడుతోంది..! అంటూ తమిళ క్రిటిక్స్ ఎమోషనల్ గా రాస్తున్నారు. గొప్ప నటుడు అయిన కమల్ హాసన్ కే ఈ ఛాన్స్ దక్కనుంది. మునుముందు కాలంలో విక్రమ్ కు సవాలు విసిరే ప్రయత్నం తమిళనాడు రాష్ట్రంలోని అగ్రశ్రేణి స్టార్లలో ఎవరు చేస్తారో ఇప్పుడు చూడాలి. రజనీకాంత్- విజయ్ లేదా అజిత్ వీళ్లలో ఎవరో ఒకరు నంబర్ వన్ అవుతారా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. తదుపరి ప్రభాస్ నటించిన సలార్- ఆదిపురుష్ - ప్రాజెక్ట్ కే ల్లో ఏదో ఒకటి మళ్లీ మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.