• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోలీసులు వేధిస్తున్నారంటూ...

పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌

By - Tupaki Desk
Update: 2020-03-17 10:30 GMT
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్‌-2 చిత్ర షూటింగ్‌ సందర్భంగా చెన్నైలో ఇటీవల భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా భారీ క్రేన్ సహాయంతో షూటింగ్ జరుపుతున్న సందర్భంలో ప్రమాదవశాత్తు క్రేన్ కూలిపోయిన ఘటనలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. సెట్స్‌లో ముగ్గురు సిబ్బంది చనిపోవడం తమిళ ఇండస్ట్రీతోపాటు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కమల్ హాసన్ ప్రమాదం లో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై, కమల్ హాసన్ మరియు దర్శకుడు శంకర్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కమల్‌ హాసన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ తీరు అభ్యతరకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. కమల్‌ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్‌ హైకోర్టు స్వీకరించింది.
Tags:    
  • Kamal Haasan alleges police harassment approaches court 
  • Kollywood 
  • Kollywood News 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS