అభిమానుల‌కు క‌మ‌ల్ హాస‌న్ హిత‌బోధ‌!

Update: 2022-10-31 01:30 GMT
`విక్ర‌మ్` స‌క్సెస్ తో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్  ఖాతాలో మ‌రో భారీ విజ‌యం ప‌డిన సంగ‌తి తెలిసిందే.  గ‌త కొంత కాలంగా వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర్కోంటున్న క‌మ‌ల్ కి  ఈ సినిమా స‌క్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. దీంతో  కొత్త ప్రాజెక్ట్ ల విష‌యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు సంసిద్ద‌మ‌వుతున్నారు.

ప్ర‌స్తుతం  ఇండియ‌న్-2 షూట్లో బిజ‌గా ఉన్న  క‌మ‌ల్ తాజాగా `సెంబి` ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అతిధిగా హాజ‌రై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. బాగున్న చిత్రాల్ని బాగున్నాయి..బాగాలేని చిత్రాల్ని బాగోలేద‌ని ప్రేక్ష‌కులు స‌హా అంతా నిర్మొహ‌మాటంగా చెప్పాల‌ని పిలుపునిచ్చారు. అలా చెప్పిన‌ప్పుడే మ‌రిన్ని మంచిచిత్రాలు రావ‌డానికి ఆస్కారం ఉంటుంద‌న్నారు.  ఇంకా ఆయ‌న మాట్లాడుతూ..

``ఆ రోజుల్లో అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు..నా  ఫోటో ఆల్బమ్‌ని వెంట‌ తీసుకెళ్లే వాడిని. ఇప్ప‌టికీ అలాంటి స‌న్నివేశాలు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి. ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నాను` అని జనాలకు చూపిస్తూనే ఉంటాను. కొందరు మంచి మాటలు చెబుతారు. మరికొందరు 'నువ్వు  ఇంకా అలాగే ఉన్నావా? అంటారు.

సినిమా అనేది పెద్ద‌..చిన్న అని తేడా  ఉండ‌దు.  సినిమాల ఆడియో లాంచ్‌లకు నేను హాజరవుతున్నాను అంటూ ఇక్కడి వక్తల్లో ఒకరు నన్ను ప్రశంసించినప్పుడు ఆ మాటలన్నీ ఈరోజు నాకు గుర్తున్నాయి. ఇక్కడి నుండి ఏది పెద్ద సినిమా? చిన్న చిత్రం అని ఎవరూ నిర్ణయించలేరు.  అది కేవ‌లం ప్రేక్ష‌కులు మాత్ర‌మే నిర్ణ‌యిస్తారు.  `16 వయత్తినీలే` సినిమా తీసి దాదాపు 40 ఏళ్ల అవుతుంది.  దాన్ని ఇప్పుడు  గుర్తు చేసుకుంటుంటే  అదే పెద్ద సినిమా? అనిపిస్తుంది.

`సెంబి' సినిమా చూసాను.  మంచి సినిమా అవుతుంది. సినిమా  కోర్ పాయింట్ బాగుంది.  మన మౌనమే పెద్ద ప్రమాదం. తప్పులు చేసేవారిని ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రశ్నించనప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి అని ఈ చిత్రం చెబుతోంది. అందుకే నాకు ఈ సినిమా నచ్చింది. మనందరి కర్తవ్యాన్ని ఈసినిమా గుర్తు చేస్తుంది. అభిమానులుగా మీకు కూడా గొప్ప బాధ్యత మరియు కర్తవ్యం ఉంది. మీరు మంచి చిత్రాల గురించి మంచిగా చెప్పండి..చెడు చిత్రాలను చెడుగా పిలవాలి. మీరు దానిని ధైర్యంగా మరియు నిర్భయంగా చేయాలి` అని అన్నారు.
Tags:    

Similar News