అట్టర్ ఫ్లాప్ మూవీని రీరిలీజ్ చేస్తారట
కమల్ హాసన్ కెరీర్లో అత్యంత భారీ అంచనాల మధ్య విడులైన అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘అభయ్’ గురించే. అప్పట్లో ఈ సినిమాను కమల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తనే స్వయంగా కథ.. స్క్రీన్ ప్లే సమకూర్చి.. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కమల్ పెర్ఫామెన్స్ మీద ప్రశంసలు కురిసినా.. సినిమాగా మాత్రం ‘అభయ్’ మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఫలితం కమల్ ను అప్పట్లో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ చిత్రాన్ని ఇంకొంచెం బాగా చేసి ఉంటే మంచి ఫలితం వచ్చేదని కమల్ ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఈ సంగతలా వదిలేస్తే.. ‘అభయ్’ దశాబ్దంన్నర తర్వాత తమిళనాట రీ రిలీజ్ అవుతుండటం విశేషం. రీ రిలీజ్ అంటే మామూలుగా కాదు. దీన్ని డిజిటలైజ్ చేసి.. మరిన్ని సాంకేతిక హంగులు సమకూర్చి ఏకంగా 500 స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత కలైపులి థాను. తమిళంలో పాత సినిమాల్ని డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది. తెలుగు నుంచి తమిళంలోకి అనువాదమై సంచలన విజయం సాధించిన ‘శంకరాభరణం’ను కూడా ఇలాగే రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. ఇటీవలే రజినీ బ్లాక్ బస్టర్ ‘బాషా’ను కూడా ఇలాగే రిలీజ్ చేశారు. ఈ కోవలోనే ‘అభయ్’ను కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఫస్ట్ రిలీజ్ లోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన మూవీ.. ఇప్పుడు ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/