బండ్ల వారి ఇంట 'శ్రీనివాస కల్యాణం'
నిర్మాత బండ్ల గణేష్ నటుడిగా నిర్మాతగా సినిమాలు తగ్గించినప్పటికి సినీ ఇండస్ట్రీలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.;
నిర్మాత బండ్ల గణేష్ నటుడిగా నిర్మాతగా సినిమాలు తగ్గించినప్పటికి సినీ ఇండస్ట్రీలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. అలాగే దేవుడి భక్తి విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఫాలోయింగో, దేవుడంటే కూడా అంతే నమ్మకం ఉంటుంది. లేటెస్ట్ గా ఆయన ఇంట్లో జరిగిన ఒక శుభకార్యం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేష్ చాలా గ్రాండ్ గా, సంప్రదాయబద్ధంగా 'శ్రీనివాస లక్ష్మీ కల్యాణం' వేడుకను నిర్వహించారు.
వేడుక మొత్తాన్ని పెళ్లిలాగే అందంగా ప్లాన్ చేశారు. వేదిక మొత్తం అరటి ఆకులు, పసుపు ఆకుపచ్చ రంగు రిబ్బన్లతో అలంకరించడం చాలా ఫ్రెష్ గా ఉంది. ముఖ్యంగా ఈ కల్యాణం సందర్భంగా బండ్ల గణేష్ పంచె కట్టు, పసుపు పట్టు కండువా ధరించి, తలపై కలశం పట్టుకుని నడుచుకుంటూ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన భార్య కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇక కుమారులు కూడా పంచెకట్టులో అతిథులను ఆహ్వానించడం మరో హైలెట్.
శ్రీనివాస కల్యాణాన్ని అత్యంత భక్తితో నిర్వహించారు. దేవుడి విగ్రహాలను పువ్వులతో, ఆభరణాలతో అలంకరించారు. బండ్ల గణేష్, ఆయన భార్య దంపతులుగా కూర్చుని ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, అలాగే మరికొందరు ప్రముఖ నటులు వచ్చి బండ్ల గణేష్ ను అభినందించారు. వారిని బండ్ల గణేష్ దగ్గరుండి రిసీవ్ చేసుకున్నట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇది ఒక ప్రైవేట్ వేడుక అయినప్పటికీ, ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న రిలేషన్స్ వల్ల కొంతమంది ప్రముఖులు వచ్చారు.
ఎప్పుడూ మీడియాలో, సినీ రంగంలో బిజీగా ఉండే బండ్ల గణేష్, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం సమయం కేటాయించడం, దాన్ని ఘనంగా నిర్వహించడం చూస్తుంటే ఆయనకు సంప్రదాయంపై ఎంత గౌరవం ఉందో తెలుస్తోంది. మొత్తానికి బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఈ శ్రీనివాస కల్యాణం, సినీ పరిశ్రమకు ఒక పాజిటివ్ వైబ్ ను ఇచ్చింది. దేవుడి ఆశీస్సులు, ఇండస్ట్రీ పెద్దల దీవెనలు తీసుకున్న బండ్ల గణేష్ త్వరలో కొత్త ప్రాజెక్ట్స్ ను మొదలుపెడతారని, ఆ దైవబలం ఆయనకు సక్సెస్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.