• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జై లవకుశ.. ఎన్టీఆర్...

జై లవకుశ.. ఎన్టీఆర్ టైటిల్?

By - Tupaki Desk
Update: 2017-01-07 10:42 GMT
ఆల్రెడీ ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ అంటూ.. ‘నట విశ్వరూపం’ అనే పేరు హల్ చల్ చేసింది. దాని మీద అభిమానుల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అదే సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్ తమ్ముడి సినిమాకు సంబంధించిన మీడియాలో వస్తున్న అప్ డేట్స్ ఏవీ నమ్మొద్దని చెప్పడంతో ఈ టైటిల్ విషయంలో సైలెంటైపోయారు. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదే.. జై లవకుశ.

ఈ టైటిల్ విషయంలో వస్తున్నవి గాలి వార్తలనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ టైటిల్ ను కళ్యాణ్ రామ్ తన ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ బేనర్ మీద ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు కూడా. కళ్యాణ్ రామ్ ఇంకా కొత్త సినిమా ఏదీ కమిట్ కాని నేపథ్యంలో ఇది ఎన్టీఆర్ సినిమా కోసం రిజిస్టర్ చేయించిన టైటిలే అంటున్నారు. బాబీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాలో మూడు పాత్రల పేర్లు.. జై.. లవ.. కుశ అని.. అందుకే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ‘నట విశ్వరూపం’తో పోలిస్తే.. ఈ టైటిల్ మీద జనాలు పాజిటివ్ గానే రెస్పాండవుతున్నారు. ‘లవకుశ’ అనేది ఎన్టీఆర్ క్లాసిక్ మూవీకి టైటిల్ కావడంతో ఆ రకంగానూ ఇది సెంటిమెంటుగా పనికొస్తుందని భావిస్తున్నారు. ఐతే అఫీషియల్ న్యూస్ వస్తే కానీ.. ఈ టైటిల్ పక్కా అని చెప్పలేం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kalyan Ram 
  • Jai Lavakusa title 
  • NTR 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS