మిల్కీపై వాలిపోయిన నందమూరి హీరో

Update: 2017-11-23 11:40 GMT
ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్.. పటాస్ సినిమా ద్వారా వచ్చిన క్రేజును ఇంకా తరువాతి రేంజుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ మధ్యన వచ్చిన ఇజం సినిమాతో ఎక్కడికో వెళతాడని అనుకుంటే.. ఆ సినిమా హ్యాండిచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సీనియర్ డైరక్టర్ తో కలసి కొత్తగా ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

గత 30 ఏళ్ళుగా ఎన్నో యాడ్ ఫిలింస్ తీసిన సీనియర్ డైరక్టర్ జయేంద్ర అప్పట్లో 180 సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా ఫ్లాపైనప్పటికీ.. కథనం మరియు దానిని నెరేట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ తో ఆయన ఒక లవ్ స్టోరి చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు.. మిల్కీ బ్యూటి తమన్నాయే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. బృంద మాస్టర్ కొరియోగ్రాఫిలో ఇప్పుడు ఒక మాంటేజ్ సాంగ్ తీస్తున్నారట. ఆ సందర్బంగా తీసిన ఫోటోలో మన నందమూరి హీరో చూడండి.. మిల్కీ భుజంపై అలా వాలిపోయాడు. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది కదూ.

ఈ మధ్యన తమన్నా చేతిలో అస్సలు సినిమాల్లేవు అనుకున్నవేళ.. అమ్మడికి వరుసగా భలే లవ్ స్టోరీ ఆఫర్లు వస్తున్నాయి. విక్రమ్ తో స్కెచ్.. సందీప్ కిషన్ తో లండన్ లో షూట్ చేయబడిన మరో సినిమా.. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ తో చేస్తున్న సినిమా.. వరుసగా అన్నీ ప్రేమకథలే. ఆ విధంగా గ్లామర్ ను పక్కనపెట్టి ఒక్కసారైనా తన ఓవర్ యాక్టింగ్ టాలెంటుతో కాకుండా రియల్ నటనతో తమన్నా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఈ సినిమా కాకుండా ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్ 'మంచి లక్షణాలున్న అబ్బాయి' (ఎం.ఎల్.ఎ) అంటూ మరో సినిమా కూడా చేస్తున్నాడు.


Tags:    

Similar News