'కిన్నెరసాని' తో వస్తున్న మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో మెప్పించాడు. ఈ క్రమంలో 'సూపర్ మచ్చి' అనే చిత్రంలో నటించిన కళ్యాణ్.. ఇటీవలే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించారు. నేడు దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని ఈ సినిమాకి ''కిన్నెరసాని'' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా 'కిన్నెరసాని' టైటిల్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
'కిన్నెరసాని' టైటిల్ పోస్టర్ లో సినిమా నేపథ్యం ప్రతిభింబిచేలా ప్రశాంతమైన సముద్రపు ఒడ్డు, ఒక పుస్తకానికి గొలుసుతో తాళం వెయ్యడం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేయడం జరిగింది. అలానే టైటిల్ కి ఉపశీర్షికగా 'అతి సర్వత్ర వర్జయత్' (హద్దు లేకపోవడం ప్రమాదకరం) అనే సంస్కృత పదాన్ని కూడా జత చేశారు. ప్రేమ మరియు బాధ ను ఈ చిత్రం ద్వారా చూపించనున్నారని తెలుస్తోంది. కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న రామ్ తళ్లూరి మరో కంటెంట్ బేస్డ్ సినిమాని నిర్మిస్తున్నాడని 'కిన్నెరసాని' టైటిల్ పోస్టర్ తో అర్థం అవుతోంది.
కాగా, గతంలో 'కల్కి' వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్ సాయి తేజ్ ''కిన్నెరసాని'' చిత్రానికి కథ మరియు కథనం అందిస్తున్నారు. అలానే 'ఛలో' 'భీష్మ' చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.