• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #గెట్ రెడీ.. RAA ఏజెంట్...

#గెట్ రెడీ.. RAA ఏజెంట్ చంద‌మామ విన్యాసాలు

By - Tupaki Desk
Update: 2021-08-28 08:30 GMT
SPY పాత్ర‌లు.. RAA ఏజెంట్లు NIA అధికారుల సాహ‌సాలు ARMY .. AIRFORCE స‌క్సెస్ స్టోరీలు .. ఇటీవ‌ల పెద్ద‌తెర ఓటీటీల్ని ఏల్తున్న  కాన్సెప్టుల‌కు పెద్ద తోడుగా నిలుస్తున్న పాత్ర‌లివి. ఇంత‌కుముందు పీఎస్ వి గ‌రుడ వేగ‌-  వైల్డ్ డాగ్ చిత్రాల్లో రాజ‌శేఖ‌ర్.. నాగార్జున ఎన్.ఐ.ఏ అధికారులుగా క‌నిపించారు. ఆ పాత్ర‌ల‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ప్రవీణ్ సత్తారుతో తాజా చిత్రంలోనూ నాగార్జున మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో మెప్పించ‌బోతున్నారు. RAA ఏజెంట్ గా నాగ్ క‌నిపిస్తార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. నాగార్జున‌తో పాటు  ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ కాజ‌ల్ ప్రీ-లుక్ పోస్టర్ ను విడుదల చేయగా.. కాజల్ ఆన్ లొకేషన్ స్టిల్ ను తాజాగా షేర్ చేసింది. ఈ ఫోటోలో త‌న లుక్ ఎంతో లైవ్ లీగా క‌నిపిస్తోంది. తుపాకీతో రా ఏజెంట్ గెటప్ లో కనిపించిన కాజల్ కి ప్రవీణ్ సత్తారు దృశ్యాన్ని వివరిస్తున్నారు.

రాత్రివేళ‌లో స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తుండ‌డంతో డార్క్ లైట్ క‌నిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. కాజ‌ల్ ఈసారి రొటీన్ కి భిన్నంగా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న ఛాలెంజింగ్ పాత్ర‌లో న‌టిస్తోంది. కాజ‌ల్ త‌దుప‌రి చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య చిత్రంలోనూ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న భార‌తీయుడు 2 చిత్రంలోనూ కాజ‌ల్ న‌టిస్తోంది.

మునుముందు ఈ సినిమాకి సంబంధించిన ప‌లు అప్ డేట్ ల‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఇంత‌కుముందు చిత్ర‌ నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సంద‌ర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మూవీ పోస్ట‌ర్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. చేతిలో కత్తితో నాగార్జున యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో ఉన్న ప్రీ-లుక్ పోస్టర్ ను విడుదల చేయ‌గా వైర‌ల్ గా మారింది. పోస్ట‌ర్ చూడ‌గానే గ‌గుర్పొడిచే యాక్ష‌న్ విన్యాసాల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని అర్థ‌మ‌యింది.  నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29 న ఈ టీమ్ నుంచి మ‌రో అద్భుతమైన అప్ డేట్ రానుంద‌ని కూడా పోస్ట‌ర్ లో వెల్ల‌డించారు.

కమర్షియల్ ఎంటర్ టైనర్ ల‌ స్పెషలిస్ట్ ప్రవీణ్ సత్తారు ఈసారికూడా మ‌రో అద్భుత‌మైన‌ స్క్రిప్ట్ ని రాశారు. నిర్మాతలు దీనిని భారీ విజువల్ వండ‌ర్ గా తీర్చిదిద్ద‌డానికి అవ‌స‌ర‌మైన  బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP - నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్ .. అనిఖా సురేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ.. బ్రహ్మ కడలి కళా ద‌ర్శ‌క‌త్వం ప్ర‌ధాన అస్సెట్స్. రాబిన్ సుబ్బు- నభా మాస్టర్ త‌దిత‌ర‌ అత్యున్నత సాంకేతిక బృందం ఈ చిత్రం కోసం పనిచేస్తోంది.
Tags:    
  • nagarjuna 
  • nagarjuna latest movies 
  • nagarjuna tfi 
  • Praveen Sattaru 
  • Kajal Aggarawal 
  • Narayan Das K Narang 

Similar News

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

సీనియర్ హీరోలు ఈ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారా?

2026-11-16 16:30 GMT

దుల్కర్ సల్మాన్ స్టోరీ సెలెక్షన్ లో ఏం చూస్తాడో తెలుసా.? దానివల్లే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందా?

2026-11-16 15:30 GMT

ఏడాదిలో రెండు ప్లాన్‌ చేస్తున్న అల్లు అర్జున్‌

2026-11-16 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS