కాజల్ తగ్గట్లేదసలు

Update: 2015-10-07 08:54 GMT
టెంపర్ తర్వాత కాజల్ అగర్వాల్ కు తెలుగులో అసలు అవకాశాలే లేవు. తమిళంలో చూస్తే.. మారి, పాయుం పులి అనుకున్నంతగా ఆడలేదు. దీంతో ఇక అమ్మడి పనైపోయినట్లే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి, చెల్లెలి మాదిరే పెళ్లి చేసుకోవడమే తరువాయి అని సెటైర్లు వేశారు చందమామపై. కానీ ఇప్పుడు కాజల్ జోరు చూస్తుంటే ఇంకో మూణ్నాలుగేళ్లు సౌత్ సినిమాల్ని ఏలేలాగే కనిపిస్తోంది. ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద పెద్ద అవకాశాలు కొట్టేస్తూ దూసుకెళ్తోంది కాజల్. తెలుగులో ఇప్పటికే పవన్ పక్కన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మహేష్ కు జోడీగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు చేస్తున్న కాజల్.. తమిళంలోనూ మంచి మంచి ఛాన్సులు అందుకుంటోంది.

ఇప్పటికే జీవా హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కావలై వేండాం’లో నటిస్తున్న కాజల్.. తాజాగా విక్రమ్ కు జోడీగా ఇంకో సినిమా ఒప్పుకుంది. సమంతతో ‘10 ఎన్రదుకుల్లా’ సినిమా పూర్తి చేసిన విక్రమ్.. ‘మర్మ మనిదన్’ అనే సినిమా చేయబోతున్నాడు. తెలుగులోకి ‘డైనమైట్’గా రీమేక్ అయిన ‘అరిమా నంబి’తో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్న రెండో సినిమా ఇది. దాదాపు రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో కాజల్ సోలో హీరోయిన్ కావడం విశేషమే. దీంతో పాటు లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న ‘మొట్ట శివ కెట్ట శివ’లో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది కాజల్.
Tags:    

Similar News