అందాల భామలు మూడు ముక్కలాట
అందాల కథానాయికల ఆలోచనలు మారిపోయాయి. పాత రోజులు పోయి కొత్త రోజులొచ్చాయి. ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఇక్కడ కాసులు కురిపించుకునే తెలివితేటలే ముఖ్యం. అది పెద్ద తెర అయినా బుల్లితెర ఓటీటీ అయినా ప్యాకేజీ అందుకోవడం ముఖ్యం. కెరీర్ ని పొడిగించడం చాలా అవసరం. అందుకే తాము దేనికైనా సై అనేస్తున్నారు. ఇటీవల అగ్రకథానాయికలు పారితోషికం సరిగా కుదిరితే ఓటీటీలను విడిచిపెట్టడం లేదు.
గత కొంతకాలంగా స్టార్ హీరోయిన్లు సమంత- కాజల్ - తమన్నా తమ వైఖరిని మార్చుకున్నారు. బాలీవుడ్ నాయికల తరహాలోనే భారీ ఓటీటీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 తో పెద్ద సక్సెస్ కాగా.. తమన్నా థ్రిల్లర్ బేస్డ్ సిరీస్ లో నటించి మెప్పించారు. కాజల్ కూడా ఓటీటీలో అడుగుపెట్టారు.
ఆసక్తికరంగా కాజల్ అగర్వాల్ ఓ టీవీ షో చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఇప్పటికే సమంత ఆహా లో సామ్ జామ్ లాంటి కార్యక్రమంతో ఆకట్టుకోగా.. తమన్నా కూడా టీవీ షో చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో కాజల్ కూడా టీవీ షో చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
కాజల్ ఓ వైపు కథానాయికగా నటిస్తున్నా ఇతర మార్గాల్లోనూ కెరీర్ ని బిజీగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక టీవీ షో కోసం కాజల్ కు భారీ మొత్తమే ముడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే కాజల్ తమిళంలో ఓ వెబ్ సిరీస్ చేసారు. ఆశించినంత విజయం సాధించకపోయినా తదుపరి భారీ సిరీస్ ల వైపు ఆలోచించే వెసులుబాటు కలిగింది. టీవీ షో ప్రారంభిస్తే ఇక బుల్లితెరపైనా రకరకాల పాత్రలు పోషించే అవకాశం కలుగుతుంది.
కాజల్ నటించిన `ఆచార్య` త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే `భారతీయుడు 2`లోనూ కాజల్ నటిస్తోంది. అటు బాలీవుడ్ కోలీవుడ్ పైనా ఈ భామ దృష్టి సారించినా ఆశించినంతగా అవకాశాలు అయితే లేవు. అందుకే ఇప్పుడు ఇతర మార్గాలవైపు కాజల్ ఆలోచిస్తోంది.