డీఎస్పీ సీరియస్ హీరోగానేనా!
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటి వరకూ సంగీత దర్శకుడిగానే సుపరిచితం. హీరోగా, నటుడిగా ఏ సినిమాలో కనిపించలేదు.;
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటి వరకూ సంగీత దర్శకుడిగానే సుపరిచితం. హీరోగా, నటుడిగా ఏ సినిమాలో కనిపించలేదు. అప్పుడప్పుడు తాను సంగీతం అందించిన సినిమాల్లో మాత్రం స్టార్స్ మధ్యలో స్టెప్ అందుకునేవాడు. అంతకు మించి డీఎస్పీ కెమెరా ముందు కనిపించింది లేదు. కానీ మ్యూజిక్ షోలతో మాత్రం తనలో ట్యాలెంట్ ని బటయ పెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాడు. స్టార్ హీరోలకు సంగీతం అందించాడంటే? షో అంతా రాక్ స్టార్ హైలైట్ అవుతుంటాడు. తాను కంపోజ్ చేసిన పాటలకు డాన్సులతో అలరించడం అతడి ప్రత్యేకత.
ఇండియాలో ఎంతో మంది సంగీత దర్శకులున్నా? డీఎస్పీ రేంజ్ ఎనర్జిటిక్ గా మరో మ్యూజిక్ డైరెక్టర్ కనిపించరు? అన్నది అంతే వాస్తవం. అదే ఎనర్జీతో హీరోగానూ ఎంట్రీ ఇస్తున్నాడు. `బలగం` ఫేం వేణు దర్శకత్వం వహిస్తోన్న `ఎల్లమ్మ` సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నాడు. తొలుత ఈ సినిమాలో హీరోగా ఇద్దరు , ముగ్గురు హీరోలను అనుకున్నా? చివరిగా వాళ్లందర్నీ దాటుకుని డీఎస్పీ వద్దకు చేరుకుంది. ఇప్పటికే సినిమాకు సంబం ధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందించడం విశేషం. ఇలా `ఎల్లమ్మ` కోసం డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడు.
అయితే నటుడిగా డీఎస్పీ ఎంత సీరియస్ గా ఉన్నాడు? అన్నదే కీలకం. సంగీత దర్శకుడిగా మంచి పేరుంది. ఎన్నో సినిమాలకు పని చేసాడు. ఎంతో మంది స్టార్స్ చిత్రాలకు సంగీతం అందించాడు. దాదాపు అన్ని సినిమాలు సంగీత పరంగా మంచి సక్సెస్ అయినవే. ఇప్పుడా ఇమేజ్ ను దాటొచ్చి హీరోగా ఎట్రీ ఇస్తున్నాడు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ భవిష్యత్ లోనూ హీరోగా కొనసాగుతాడా? ఈ సినిమా వరకూ నటుడిగా ఉంటాడా? అన్న సందేహం చాలా మంది లో ఉంది. `ఎల్లమ్మ` లో ముందుగా నాని హీరోగా అనుకునే ప్రాజెక్ట్ లాక్ అయింది.
కానీ అనివార్య కారణాలతో అతను తప్పుకున్నాడు. అనంతరం నితిన్ ప్రాజెక్ట్ లో చేరాడు. దిల్ రాజు నిర్మాణం కావడంతో నితిన్ కాన్పిడెంట్ గా వచ్చాడు. కానీ చివరి నిమిషంలో నితిన్ కూడా డ్రాప్ అయ్యాడు. మరి ఇలా ఇద్దరు పేరున్న హీరోలు డ్రాప్ అయిన కథలో డీఎస్పీ నటించడం అన్నది? అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా? భవిష్యత్ ను నిర్దేశించుకుని తీసుకున్న నిర్ణయమా? అన్న సందేహం చాలా మందిలో ఉంది. అవెలా ఉన్నా? `ఎల్లమ్మ` సక్సెస్ అయితే మాత్రం హీరోగా కొత్త అవకాశాలకు కొదవుండదు అన్నది అంతే వాస్తవం.