కాజల్ ఖర్చు.. నెలంతా 3 వేలే
కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నా.. బిలియన్ డాలర్ సొమ్ముల్ని అకౌంట్ లో నింపుకునేంత ఆర్జన ఉన్నా .. ఓ సగటు అమ్మాయిలా ఖర్చు చేస్తూ మామూలు జీవితాన్ని గడిపేయడం అంటే ఆషామాషీనా? ఈ రోజుల్లో ఓ సాధారణ గృహిణి సైతం నెలకు మినిమం 20 వేల ఖర్చు చేయించనిదే మగనితో కాపురం చేయని పరిస్థితి. అలాంటిది ఓ సెలబ్రిటీ, అందునా స్టార్ హీరోయిన్ ,కోట్లలో పారితోషికాన్ని దశాబ్ధ కాలంగా అందుకుంటున్న స్టార్ హీరోయిన్ కేవలం నెల గడవడానికి 3వేలతోనే సరిపెట్టుకుంది అంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాలి. అసలు ఇదంతా ఎవరిగురించో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది.
ఈ మ్యాటరంతా సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించే. ఈ భామ కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నా బైట షాపింగులకు వెళ్లినప్పుడు చాలా పొందిగ్గా ఖర్చు చేస్తుంది. ప్రతి రూపాయి విలువైనదే. సంపాదించినదానిని పొదుపు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు డబ్బును ఖర్చు చేయకూడదని క్లాస్ తీసుకుంటోంది అమ్మడు. అయితే ఇంత నాలెజ్ ఈ అమ్మడికి నేర్పించింది ఎవరు? అంటే మా అమ్మేనని చెబుతోంది.
కాలేజీ కి వెళ్లే రోజుల్లో నెల నెలా రూ.3 వేల చొప్పున పాకెట్ మనీ ఇచ్చేది మమ్మీ. వారంలోగానే ఖర్చు పెట్టేసి మళ్లీ అడిగేదాన్ని. అలా ఇవ్వను. ఆ మూడు వేలతోనే నెలంతా గడిపేయాలి. ఏం చేస్తావో? ఎలా చేస్తావో ?? నీ ఇష్టం అంటూ మమ్మీ నాకు సవాల్ విసిరేది. అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఖర్చు చేయడం తెలుసుకున్నా.. అని చెబుతోంది. ఏవండోయ్ దుబారా మ్యాడమ్స్.. దుబారా బాబాయ్స్ .. మీకోసమే ఈ క్లాసంతా!