ఫోటో స్టోరీ: లవ్ సింబల్ పెట్టిన కాజల్

Update: 2019-12-10 13:24 GMT
కాజల్ అగర్వాల్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సీనియర్ హీరోయిన్. 15 ఇయర్స్ ఇండస్ట్రీ.  కాజల్ ఫేడ్ అవుట్ అయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అదేమీ నిజం కాదు. ఇప్పటికీ చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయి.  బడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేవు కానీ ఇప్పటికీ ఛాన్సులయితే ఉన్నాయి.  ఇక ఈ భామ సామాజిక మాధ్యమ తత్వవేత్త.  హాటు ఫోటోలతో తనదైన శైలిలో రెచ్చిపోతూ ఉంటుంది.

అయితే నిన్న తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో మాత్రం రొటీన్ కు భిన్నంగా ఉంది.  నిజానికి ఈ ఫోటో కాజల్ ను ఫాలో ఫాలో అంటున్న చాలామందిని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది.  ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? అంతర్జాలికుల సమూహం.. అంతర్జాలం ఒక్క ఛాయాచిత్రానికే ఎందుకు కకావికలు అయ్యాయి?  ఈ ఫోటోలో బీచ్ లో నిలుచుంది సూర్యుడి వైపు తిరిగి నిలుచుంది కాజల్.  చేతులు రెండు పైకెత్తి వేళ్ళతో లవ్ సింబల్ పెట్టింది. ఫోటోను వెనుక నుంచి తీయడంతో కాజల్ మొహం కనిపించడం లేదు కానీ ఆ లవ్ సింబల్ ఎందుకు పెట్టినట్టు?  ఈ ఫోటోకు కాజల్ ఇచిన క్యాప్షన్ 'డిసెంబర్ వైబ్స్'.  ఈ క్యాప్షన్ తో పాటుగా ఒక లవ్ సింబల్ ఎమోజి కూడా పెట్టింది.

ఈ ఫోటోను చూడడం ఆలస్యం.. నెటిజన్లు "లవ్ లో పడ్డావా?" అంటూ ప్రశ్నించారు.  అయినా ప్రేమ గుర్తు చూపించడానికి ప్రేమలో పడాలని రూలేమైనా ఉందా? అయినా లవ్వు గివ్వు లాంటి పాతచింతకాయ పచ్చడి ఫైలాసఫీలతో టైం వేస్ట్ చేసుకునే భామ కాజల్ కాదని ఇప్పటికే టాక్ ఉంది. అలా అయితే ఎందుకు ఆ లవ్ సింబల్ పెట్టినట్టో??

Tags:    

Similar News