ట్రైలర్ టాక్: కడపలో ఇన్ని బూతులా?

Update: 2017-12-15 05:25 GMT
వెబ్ స్పేస్. ఇప్పుడు ఇండియాలో సెన్సారింగ్ అనేదే లేని ఒక ఫిలిం స్ర్టీమింగ్ ఏరియా ఏదన్నా ఉందా అంటే.. అది యుట్యూబ్.. విమియో.. వంటి వీడియో షేరింగ్ సైట్స్ అనే చెప్పాలి. అందుకే మనోళ్ళు న్యూడిటీ మరియు బూతులను ఈ ఏరియాలో తెగ వాడేస్తున్నారు. చాలా హిందీ వెబ్ సిరీస్ లలో 'ఛూ..యా' వంటి బూతులు వింటుంటే.. తెలుగులో ఇంకా ఇలాంటి బూతులు వాడట్లేదు ఏంటా అనుకున్నాడేమో రామ్ గోపాల్ వర్మ.

అదిగో అక్కడ చూడండి.. ''కడప'' అంటూ తన కొత్త ప్రొడక్షన్ వెంచర్ తాలూకు ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశాడు ఇప్పుడు. ఇదో వెబ్ సిరీస్. అయితే ఈ ట్రైలర్లో టాప్ యాంగిల్లో షాట్లు.. కత్తులు.. నరకడాలు.. బూతులు తప్పించి పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. ఆల్రెడీ వర్మ తీసిన రక్తచరిత్ర మరియు ఇతర రక్తపాతపు సినిమాల తాలూకు బిట్స్ ను మళ్ళీ రీషూట్ చేసి పెట్టినట్లే ఉంది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో.. 'రాయలసీమ ఫ్యాక్షన్ కు అమ్మ అయితే.. కడపు బాబు' అంటూ చెప్పే డైలాగ్.. అలాగే ఇది కడప రెడ్ల చరిత్ర అనడం.. ఏదో రెచ్చగొట్టే ప్రయత్నమే కాని.. అభినందనీయం కాదు. అలాగే డైరక్టుగా 'ల..జా కొడకా' 'దె..గులాట' అంటూ బూతులను కూడా స్ర్టయిట్ గా వినిపించడం కూడా అసహ్యంగా ఉంది.

మనకు సెన్సార్ అథారిటీ లేదు కాబట్టి.. అక్కడ ఏదన్నా కొత్త ప్రయత్నాలు చేయాలని కాని.. ఇలా బూతులను పండిస్తూ అదేదో గొప్ప ఫిలిం మేకింగ్ ఎచీవ్మెంట్ తరహాలో చెబితే మాత్రం రామ్ గోపాల్ వర్మ కంటే పెద్ద మూర్ఖుడు వేరెవరు ఉండేరేమో. పైగా కొన్ని కులాల పేర్లను ప్రస్తావించి.. వాటిని ఇంకా అగౌరవపరిచే రీతిలో ఇలాంటి వెబ్ సిరీస్ లు తీయడం సమంజసమేనా? అసలు కడప రెడ్ల కథ అంటే.. ఆ ఊళ్ళో వేరే కులాల వారే లేరా? ఇలా ఒక వర్గాన్ని తన సీతకన్ను కోణంలోంచి చూపిస్తూ వర్మ ఏం సాదిధ్దాం అనుకుంటున్నాడు? మిష్టర్ వర్మ.. ఇది పరాకాష్ట నాయనా!!

Full View
Tags:    

Similar News