• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ర్శకేంద్రుడు అండ్ స‌న్...

ద‌ర్శకేంద్రుడు అండ్ స‌న్ వాట్టూడూ?

By - Tupaki Desk
Update: 2019-05-24 06:34 GMT
ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. `ఓం న‌మో వెంక‌టేశాయ` ఫెయిలయ్యాక చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే గ‌త కొంత‌కాలంగా ఆయ‌న రీబూట్ అయ్యి తిరిగి వ‌స్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఓ స్టార్ హీరోతో భ‌క్తిర‌స చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో కానీ.. కె.రాఘ‌వేంద్ర‌రావు మాత్రం అధికారికంగా ఏదీ ప్ర‌క‌టించ‌లేదు. ఈసారీ భ‌క్తి సినిమాతో కంబ్యాక్ అవ్వాల‌న్న ప్లాన్ నిజ‌మేనా? ఈ నిర్ణ‌యం స‌రైన‌దేనా? అంటూ యూత్ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

అస‌లు కె.రాఘ‌వేంద్ర‌రావు మైండ్ లో ఏం ఉంది? అంటూ ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిగా ముచ్చ‌ట సాగుతోంది. ఒక వేళ ఆయ‌న దేవుళ్ల‌పై సినిమా తీయాల‌నుకుంటే ఈసారి ఏ దేవుడిపై తీస్తారు? అన్న చ‌ర్చా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్టు అయిన కె.రాఘ‌వేంద్ర‌రావు ఎందుక‌ని ఆ త‌ర‌హా సినిమా తీయాల‌ని అనుకోవ‌డం లేదు? అంటే మంచు మ‌నోజ్ హీరోగా తెర‌కెక్కించిన `ఝుమ్మంది నాదం` ఫెయిల‌వ్వ‌డం కాన్ఫిడెన్స్ ని దెబ్బ తీసింద‌న్న మాటా వినిపిస్తోంది. ఈ వ‌య‌సులో రొమాన్స్ .. ల‌వ్ అంటూ సినిమాలు తీయ‌డం స‌రికాద‌ని కె.రాఘ‌వేంద్ర‌రావు భావిస్తున్నారని అర్థ‌మ‌వుతోంది.

మ‌రోవైపు ఈ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కంగ‌న - రాజ్ కుమార్ రావ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `మెంట‌ల్ హై క్యా` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పూర్తిగా క‌థా వైవిధ్యం.. పాత్ర‌ల వైవిధ్యంతో తీస్తున్న ఈ ప్ర‌యోగాత్మ‌క‌ సినిమా హిట్ట‌వుతుందా?   అంటూ బాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రానికి ప్ర‌కాష్ కోవెల‌మూడి భార్య క‌నిక థిల్లాన్ స్క్రిప్టును అందించారు. `సైజ్ జీరో` త‌ర్వాత ఈ జోడీ క‌లిసి వ‌ర్క్ చేసిన చిత్రంగా `మెంట‌ల్ హై క్యా` త్వ‌ర‌లోనే రిలీజ‌వుతోంది.  ఈ సంద‌ర్భంగా డాడ్ - స‌న్ నెక్ట్స్ ఏంటి? ద‌ర్శకేంద్రుడు అండ్ స‌న్ వాట్టూడూ? అంటూ మాట్లాడుకుంటున్నారంతా.

    

Tags:    
  • K Raghavendra Rao 
  • Prakash Kovelamudi 
  • Movie News 
  • Latest Updates 

Similar News

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

Copyright @2026

Powered by Blink CMS