'స్టైలిష్ సూట్'లో దర్శనమిచ్చిన జూనియర్ టైగర్!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' రియాలిటీ షో ప్రోమోతో సర్ప్రైజ్ ఇచ్చాడు. నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ ను ప్రోమోలో చూసి సందడి చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ పాపులర్ రియాలిటీ షోలలో ఒకటిది. దాదాపు ప్రపంచంలోని 120 దేశాలకు పైగా ఈ రియాలిటీ షోను విజయవంతంగా రన్ చేస్తున్నాయి. కాకపోతే హిందీలో 'కౌన్ బనేగా కరోడ్ పతి'గా ఫస్ట్ మనదేశంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో నాలుగు సీజన్లు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇప్పుడు ఐదవ సీజన్ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించనున్నాడు.
అయితే ఈరోజు ప్రోమోతో పాటు ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' సూట్ వేసుకున్న ఫోటో పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ మోస్ట్ స్టైలిష్ సూట్ ధరించి కనువిందు చేస్తున్నాడు. ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆ సూట్ బ్లాక్ కలర్ లో స్టైలిష్ గా కనిపిస్తుంది. ఆ లుక్కులో ఎన్టీఆర్ ను చూస్తూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఫోటోతో పాటు ఎన్టీఆర్.. 'త్వరలోనే హాట్ సీట్ లో కలుద్దాం' అంటూ కాప్షన్ జోడించాడు. ఇంకేముంది ప్రేక్షకులలో ఈ షో పై మరింత ఆసక్తిపెరిగింది. ఈ షో జెమినీ టీవీ ఛానల్లో వారాంతపు రోజుల్లో అంటే శని, ఆదివారాలలో ప్రసారం అవుతుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.