అది నిజంగా తారకేనా ?

Update: 2019-06-27 05:57 GMT
నిన్నంతా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. మాట వినకుండా మొరాయిస్తున్న ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఓ యువకుడు ఉండటం అందులో హై లైట్ అయ్యింది. మాములుగా అయితే దీనికి ఎలాంటి విశేషం లేదు. కానీ అందులో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ అని ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సన్నద్ధం కావడం కోసం ట్రైనింగ్ లో భాగంగా ఇది చేయించారని ఫాన్స్ దీన్ని తెగ షేర్ చేసుకున్నారు.

కానీ వీడియో కేవలం 9 సెకండ్లు మాత్రమే ఉండటం క్లారిటీ పూర్తిగా లోపించడం మనిషి రూపం కూడా కేవలం వెనుక భాగం మాత్రం కనిపించేలా షూట్ చేయడం వల్ల అది నిజంగా ఎన్టీఆరా కదా అనే సందేహం ఇంకా వీడలేదు. అభిమానులు మాత్రం ఆ వ్యక్తి రూపు రేఖల ఆధారంగా అది తారకెనని వైరల్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సింది అయితే ఎన్టీఆరో లేదా రాజమౌళి. నిజం కాదని స్పందిస్తే ఇలాంటి రియాక్షన్ల కోసమైనా జనం ఉత్తుత్తి వీడియోలు చేసి వదిలే ఛాన్స్ ఉంది.

ఇదో పెద్ద తలనెప్పిగా మారుతుంది. దానికి బదులుగా ఇలా సైలెంట్ గా ఉండటమే ఉత్తమం. ఒకవేళ జూనియర్ అయితే వీడియో ఇంకాస్త క్లారిటీతో ఉండింటే అభిమానులు పండగ చేసుకునేవాళ్ళు. ఏదైతేనేం కన్ఫ్యూజన్ లోనే ఈ వీడియోనే మహాభాగ్యంగా భావించి అందరికి షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ త్వరలో అహ్మదాబాద్ లాంగ్  షెడ్యూల్ కోసం అవుట్ డోర్ వెళ్లనుంది

For Video Click Here

Tags:    

Similar News