• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'జర్నీ' సాంగ్: పెట్ డాగ్...

'జర్నీ' సాంగ్: పెట్ డాగ్ చార్లీతో ధర్మ జాయ్ ఫుల్ రైడ్..!

By - Tupaki Desk
Update: 2022-05-30 15:43 GMT
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలను అందించడానికి కృషి చేస్తుంది. ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు తమ బ్యానర్ లో ఇతర భాషల్లో రూపొందిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''777 చార్లీ'' అనే వైవిధ్యమైన సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

'కేజీయఫ్' ప్రాంఛైజీ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో.. ఇప్పుడు కన్నడ స్టార్స్ మరియు ఫిలిం మేకర్స్ అంతా అదే బాటలో పయనిస్తున్నారు. రక్షిత్ శెట్టి హీరోగా కిరణ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ''777 చార్లీ''. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని జూన్ 10న తెలుగు కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి సమర్పిస్తున్న '777 చార్లీ' సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా 'జర్నీ' అనే సాంగ్ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు.

'777 చార్లీ' అనేది మనిషికి కుక్క కు మధ్య సాగిన ఎమోషనల్ జర్నీ అని ట్రైలర్ ని బట్టి అర్థం అయింది. ఇప్పుడు 'జర్నీ' సాంగ్ లో కూడా ఇదే చూపించారు. ధర్మ - చార్లీ కలిసి బైక్ పై దేశాన్ని చుట్టి వస్తున్నారని తెలుస్తోంది. ఇక షూటింగ్ సమయంలో చిత్ర బృందానికి డాగ్ తో ఏర్పడిన బాండింగ్ ని.. షూటింగ్ జరిపిన విధానాన్ని ఈ పాటలో చూడొచ్చు.

'జర్నీ' పాటకు నోబిన్ పాల్ స్వరాలు సమకూర్చగా.. రామ్ మిరియాల మరియు అభినందన్ కలిసి ఆలపించారు. 'మున్నాళ్ల ఆటే బ్రతుకంటే.. నువ్వు నేనూ జోడీ కట్టి కాలం మీద స్వారీ చేద్దాం.. రమ్మంది రహదారి.. గమ్యంలేని బాటసారిగా..' అంటూ బట్టు విజయ్ కుమార్ అర్థవంతమైన సాహిత్యం అందించారు.

'777 చార్లీ' సినిమాలో సంగీత శృంగేరీ హీరోయిన్ గా నటించగా.. దర్శక నటుడు రాజ్ బీ శెట్టి - డానిష్ సేత్ - బాబీ సింహా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పరమ్ వహ్ బ్యానర్ పై జి.ఎస్.గుప్తా మరియు రక్షిత్ శెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

Full View
Tags:    
  • 777 Charlie 
  • Journey 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS