పారిశ్రామికవేత్త ఎఫైర్.. హీరో వార్నింగ్

Update: 2020-07-30 00:30 GMT
హాలీవుడ్ హీరో భార్యతో ఓ అమెరికన్ పారిశ్రామికవేత్త ఎఫైర్ పెట్టుకున్నాడని.. అందుకే ఆ జంట విడిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సదురు పారిశ్రామికవేత్త ఈ వార్తలపై స్పందించాడు.

హాలీవుడ్ హీరో జానీ డెప్- హీరోయిన్ అంబర్ హర్డ్ జంట హాలీవుడ్ లో స్టార్ యాక్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ 2015లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. 2017లో వివాదాలు తలెత్తడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇక తన భార్య అంబర్ హర్డ్ ను జానీ విపరీతంగా కొట్టాడని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అందుకే విడిపోయారని రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే హీరో జానీ డెప్ స్పందించారు. తన భార్యకు తనకు గొడవలకు కారణం టెస్లా సీఈవో, అమెరికా పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్ అని హీరో జానీ ఆరోపించాడు. తన భార్య అంబర్ తో ఎలాన్ మాస్క్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జానీ ఆరోపించాడు. అందుకే తాము విడిపోయామని వివరించాడు.

కాగా ఈ ఆరోపణలపై పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించాడు. హీరో జానీ డెప్ భార్య అంబర్ తో తనకు అసలు ఎఫైరే లేదని స్పష్టం చేశారు. ఈ తప్పుడు వార్తలను ఖండించాడు.
Tags:    

Similar News