ఫోటో స్టోరీ: స్టార్.. అంతే.. కాదంటారా?

Update: 2018-06-02 06:06 GMT
అసలే అందాల భామ.. అందులోనూ ఈ తరం కుర్ర బ్యూటీ.. కాబోయే స్టార్ హీరోయిన్ అనే అంచనాలు.. కోట్ల మంది ఆసక్తి నిండిన ఎదురుచూపులు.. అన్నిటికీ మించి అందాల తార శ్రీదేవి కూతురు. ఇవన్నీ జాన్వి కపూర్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ కు మాత్రమే వినిపించే కబుర్లు. మరి ఇంతలేసి అంచనాలను జాన్వి అందుకుంటుందా అన్నది చాలామందిలో ఉన్న డౌట్.

ఇప్పటివరకూ ఉన్న అనుమానాలు అన్నిటినీ ఒక్క దెబ్బతో పటాపంచలు చేసేసింది జాన్వి కపూర్. వోగ్ ఇండియా మేగజైన్ కు రీసెంట్ గా ఈ భామ ఇచ్చిన ఫోటో షూట్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఈ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కు కవర్ పేజ్ చూస్తే చాలు.. జాన్వి మీద ఏ మూలైనా ఎవరికైనా ఏ కొంచెం అయినా అనుమానాలు ఉంటే.. అవన్నీ ఒక్క లుక్కుతో తీరిపోతాయి. తను కాబోయే స్టార్ హీరోయిన్ అనిపించేలా అమ్మడు ఇచ్చిన స్టైల్ స్టేట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. తన స్కిన్ టోన్ కి దగ్గరగా ఉండే మ్యాచింగ్ డ్రెస్.. లెదర్ జాకెట్ ను సగం విప్పి.. సగం వేసుకున్న వైనం.. క్లీవేజ్ సోయగాలు కనిపించేలా సగం సగం చూపిస్తున్న తీరు అదుర్స్ అంతే.

హెయిర్ స్టైల్ నుంచి.. అమ్మడి కళ్లలో మెరుపుల వరకూ.. ఫ్రతీ ఇంచ్ ఇంచ్ కు విపరీతమైన అట్రాక్టివ్ గా ఉంది జాన్వి కపూర్. సింపుల్ గా మెడలో ఉన్న ఒక్క సన్నని చైన్ మాత్రమే చూస్తే.. జాన్వికి అందమే అసలు సిసలైన ఆభరణం అయితే.. ఇక వేరే నగలు ఎందుకు అనిపించక మానదు. జాన్వి అరంగేట్ర చిత్రం ధడక్.. జూలై 20న వస్తున్న సంగతి తెలుసు కదా.
Tags:    

Similar News