జీవానూ రంగంలోకి దించిన ధోని

Update: 2021-01-04 03:50 GMT
టీం ఇండియా ఆటగాళ్లలో ఒకప్పుడు సచిన్‌ టెండూల్కర్‌ అత్యధిక బ్రాండ్స్ కు అంబాసిడర్‌ గా వ్యవహరించేవాడు. ఆయన తర్వాత టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆ స్థానంలో నిలిచాడు. సచిన్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పిన తర్వాత బ్రాండ్స్ కూడా ఆయనకు దూరం అయ్యాయి. కాని ధోని క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పినా కూడా ఆయన వద్ద ఇంకా పదుల సంఖ్యలో బ్రాండ్స్‌ ఉన్నాయి. ఎంఎస్‌ ధోని గతంలో తన భార్య సాక్షితో కలిసి ఒక కమర్షియల్‌ యాడ్‌ లో నటించిన విషయం తెల్సిందే. ఈసారి ఆయన తన కూతురును కూడా కమర్షియల్ యాడ్‌ లోకి తీసుకు వచ్చాడు.

ధోనికి కూతురు జీవా అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడి మాదిరిగా జీవాతో కలిసి పోయి ఆడుకునే ధోని 'ఓరియో' బిస్కట్‌ కోసం జీవాతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. 6వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న జీవా అప్పుడే బుల్లి తెర కమర్షియల్‌ లో సందడి చేసింది. తండ్రితో కలిసి ఓరియో బిస్కట్‌ యాడ్‌ లో నటించి ఆకట్టుకుంది. నిజంగా చాలా క్యూట్‌ గా ఉంది జీవా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ధోని తన కూతురును కెమెరా ముందుకు తీసుకు రావడం పట్ల కొందరు కామెంట్స్ చేసే వారు కూడా ఉన్నారు. జీవా కూడా అప్పుడే సంపాదిస్తుందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీన్ని సరదాగా తండ్రి కూతురు కలిసి చేశారు అనుకోవచ్చు కదా అంటూ ధోని అభిమానులు అంటున్నారు.
Tags:    

Similar News