భర్త మరణంపై జయసుధ ఏమన్నారంటే..
ప్రముఖ నటి - మాజీ ఎమ్మెల్యే జయసుధ ఇటీవల తన భర్తను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త నితిన్ కపూర్ ముంబయిలో మరణించారు. అయితే, ఈ రోజు జయసుధ, నితిన్ కపూర్ ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా జయసుధ తన భర్త జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆయనెప్పుడు మానసిక శాంతిని కోరుకునేవారని.. ఇప్పుడు దేవతల మధ్యకు వెళ్లిన ఆయనకు కోరుకున్నంత మనశ్శాంతి దొరుకుతుందని అన్నారు.
తమ పెళ్లి రోజు నేపథ్యంలో జయసుధ ఫేస్ బుక్ లో స్పందిస్తూ... తన భర్త ఇప్పుడు దేవతలతో ఉన్నారని.. ఎన్నో ఏళ్లుగా తన భర్త వెతికిన శాంతి ఆయనకు ఇప్పుడు దొరికిందని ఆమె అన్నారు. డిప్రెషన్ అనేది ఎంతో తీవ్రమైన మెడికల్ కండిషన్ అని, తన జీవితంలోని ఈ చీకటి కోణాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు తన ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు.
కాగా 32 ఏళ్ల కిత్రం ఇదే రోజు ఇద్దరం ఒకటయ్యామని పేర్కొన్నారు. తన భర్త సహచర్యంలో తాను గడిపిన మధుర క్షణాలు తనకు గుర్తుకొస్తున్నాయని అన్నారు. తన భర్త ఎక్కడున్నా తమని కాపాడుతూనే ఉంటారని తనకు తెలుసని అన్నారు. తన భర్త ఆత్మకు శాంతి చేకూరాలని జయసుధ ప్రార్థించారు. తన భర్తను కోల్పోయిన విషాద సమయంలో తనకు, తన కుటుంబానికి మద్దతు ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/