• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జయసుధ లైఫ్ లోకి నితిన్...

జయసుధ లైఫ్ లోకి నితిన్ ఎలా వచ్చారు?

By - Tupaki Desk
Update: 2017-03-15 04:15 GMT
తెలుగునాట పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు జయసుధ. ఆమె అందరికి సుపరిచితమైనప్పటికి.. జయసుధ జీవితానికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. తెలుగమ్మాయి అయిన జయసుధకు అక్కడెక్కడో ముంబయిలో ఉండే నితిన్ ఎలా పరిచయం అయ్యారు? వారి మధ్య పెళ్లి ఎలా జరిగింది?వారిని దగ్గరకు చేసిన అంశాలేమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలువెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

జయసుధ తల్లి ఒక చిన్న నటి. తండ్రికి సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేదు. అయితే.. సీనియర్ నటి విజయనిర్మల బంధువే జయసుధ. మేనత్తే వరసయ్యే విజయనిర్మల.. జయసుధ తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు. నిజానికి జయసుధ అసలు పేరు సుజాత. అప్పటికే ఇండస్ట్రీలో సుజాత పేరుతో ఒకరు ఉండటంతో ఆమె పేరును జయసుధగా మార్చేశారు ప్రముఖ దర్శకులు కె.బాలచందర్.

ఇక.. జయసుధ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమెకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బంధువైన రాజేంద్ర ప్రసాద్ తో పెళ్లి జరిగింది.కానీ.. తర్వాతి కాలంలో వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలతో వివాహ బంధాన్ని తెంచేసుకున్నారు. విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు పంజాబీ ఫిలిం నిర్మత నితిన్ కపూర్ తో ప్రేమలో పడ్డారు.

1985లో విద్దరి మధ్య వివాహం జరిగింది. ఇంతకీ నితిన్ తో జయసుద పరిచయం ఎలా జరిగిందన్న విషయానికి వస్తే.. అప్పట్లో తెలుగు సినిమాల్నిమద్రాస్ లో తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు..తమిళ్.. హిందీ సినిమాలు చేసేవారు. ఆయన తీసిన హిందీ సినిమాల్లో హీరోగా జితేంద్ర వ్యవహరించే వారు. ఆయన కజినే నితిన్ కపూర్.

మద్రాస్ లో వ్యవహారాలు చూసుకోవాలంటూ నితిన్ కు జితేంద్ర బాధ్యతలు అప్పగించటం.. పనులు చూసుకోవటానికి వీలుగా ఇంటిని తీసుకోవటం.. ఆ ఇంటి పక్కన జయసుద ఉండేవారు. మొదట పరిచయం తర్వాత.. వారి మధ్య అనుబంధం అంతకంతకూ పెరిగింది.దీనికితోడు ఇరువురి అభిరుచులు దగ్గరగా ఉండటంతో చాలా త్వరగా సన్నిహితులయ్యారు. ఇరువురికి క్రికెట్.. కామన్ టాపిక్ కావటం..అభిరుచులు కలవటంతో వారి మద్య బంధం మరింత పెరటమే కాదు.. చివరకు  పెళ్లి చేసుకున్నారు.తొలిసారి నితిన్ ను చూసినప్పుడే అభిమానం కలిగందని.. ఆయనతో ఎప్పటికి కలిసి ఉండాలన్న భావన ఉండటం.. అలాంటి భావనే జయసుదకూ ఉండటంతో వారిద్దరి తర్వాతి కాలంలో లైఫ్ పార్టనర్స్ గా మారిపోయారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jayasudha husband 
  • Nitin Kapoor 
  • Jayasudha Husband Suicide 
  • Nitin Kapoor Suicide 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS