18 ఏళ్ల తర్వాత రీమేక్‌

Update: 2020-02-06 04:05 GMT
నితిన్‌ హీరోగా సదా హీరోయిన్‌ గా 18 ఏళ్ల క్రితం తేజ దర్శకత్వం లో వచ్చిన చిత్రం 'జయం'. ఈ చిత్రంతో నితిన్‌ మరియు సదాలు హీరో హీరోయిన్‌ గా పరిచయం అయ్యారు. జయం సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ సినిమా సక్సెస్‌ తో నితిన్‌ మరియు సదాలు స్టార్స్‌ అయ్యారు. ఆ చిత్రంను తమిళం లో అదే పేరుతో రీమేక్‌ చేశారు. తమిళ నాట కూడా జయం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి టీవీల్లో వస్తూనే ఉన్న జయం సినిమా కు మంచి టీఆర్పీ రేటింగ్‌ వస్తుంది.

జయం సినిమా ఒక విభిన్నమైన ప్రేమ కథా చిత్రం. చాలా సహజంగా ఉండే ఆ ప్రేమ కథలో గోపీచంద్‌ విలన్‌ గా నటించాడు. జయం వచ్చి 18 ఏళ్లు అవుతున్న ఈ సమయంలో కన్నడం లో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రవీణ్‌ అనే కొత్త నటుడు ఈ రీమేక్‌ లో హీరోగా నటించేందుకు సిద్దం అవుతున్నాడు. స్వతహా గా డాక్టర్‌ అయిన ఈయన నటనపై ఆసక్తితో సంవత్సరం పాటు నటనలో శిక్షణ పొందినట్లుగా తెలుస్తోంది.

జయం చిత్రంలో హీరో చాలా ఇన్నోసెంట్‌ గా కనిపించాల్సి ఉంటుంది. ప్రవీణ్‌ కూడా చూడ్డానికి చాలా ఇన్నోసెంట్‌ గా కనిపించడం తో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ చూపించబోతున్నట్లుగా కన్నడ సినీ వర్గాల్లో టాక్‌ వినిపస్తుంది. జయం అనేది ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక మంచి సబ్జెక్ట్‌. అందుకే ఖచ్చితం గా కన్నడం లో కూడా హిట్‌ అవుతుందనే నమ్మకంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. తెలుగు.. తమిళ ఆడియన్స్‌ మెచ్చిన జయం ను కన్నడ ప్రేక్షకులు ఆధరిస్తారా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News