• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నవీన్ బర్త్ డే పోస్టర్:...

నవీన్ బర్త్ డే పోస్టర్: 'జాతిరత్నాలు' రిలీజ్ ఎప్పుడు రా అయ్యా?

By - Tupaki Desk
Update: 2020-12-26 10:40 GMT
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''జాతిరత్నాలు''. స్వప్న సినిమాస్ బ్యానర్ లో 'మహానటి' చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మించాడు. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. ఇందులో హాస్యనటులు రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'జాతిరత్నాలు' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని సమాచారం. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ లో కూడా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నాడు మన జాతిరత్నం.

నేడు టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు కానుకగా 'జాతిరత్నాలు' టీమ్ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ఖైదీ నెం.879 డ్రెస్ ధరించిన నవీన్.. జైలులో కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు. 'మా సినిమా రిలీజ్ ఎప్పుడు రా అయ్యా?' అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. మొత్తం మీద ఈ జాతిరత్నం 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా.. తరతరాల ఎదురు చూపులు' అంటూ పాడుకుంటూ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ వారి మీద వాళ్లే సెటైర్ వేసుకుంటూ వైవిధ్యంగా ప్లాన్ చేసిన ఈ కొత్త పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూరుస్తుండగా.. సిద్దం మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. త్వరలోనే 'జాతిరత్నాలు' సినిమా విడుదలపై స్పష్టత వస్తుందేమో చూడాలి.
Tags:    
  • Jathirathnalu 
  • Naveen Polishetty 
  • Poster 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS