• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రంగ‌మ్మ‌త్త లాగా...

రంగ‌మ్మ‌త్త లాగా `ర‌క్క‌మ్మ‌`త్త ఎవ‌ర‌బ్బా!

By - Tupaki Desk
Update: 2021-08-01 08:38 GMT
`రంగ‌స్థ‌లం` సినిమాలో రంగ‌మ్మ‌.. మంగ‌మ్మ పాట మాస్ ప్రేక్ష‌కుల్లో ఎలా  దూసుకుపోయిందో తెలిసిందే. ముఖ్యంగా కుర్రాళ్ల‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ర‌క్క‌మ్మ‌త్త‌గా తెలుగు యువ‌త‌ను ఓ ఊపు ఊపేయ‌డానికి రెడీ అవుతోంది. 55 దేశాల్లో 14 భాష‌ల్లో `ర‌క్క‌మ్మ‌` గా ర‌చ్చ చేయ‌డానికి దూసుకొస్తుంది. ఇక జాక్వెలీన్  వేడెక్కించే పెర్ఫామెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మాస్ పాట‌ల్లో జాక్వెలీన్ ఎలివేష‌న్స్ ఏ రేంజులో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఓవైపు గ్లామ‌ర్ షోతో పాటు.. హాట్ హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మాస్ లోకి వీజీగా దూసుకుపోగ‌ల‌దు. ఇంత‌కీ ర‌క్క‌మ్మ‌త్త అంత‌గా ర‌చ్చ చేసేది ఏ భాష‌లోనో తెలియాలంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

కిచ్చా సుదీప్ క‌థానాయ‌కుడిగా అనూప్ బండారి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ `విక్రాంత్ రోనా`. ఈ  యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమా ని 3డిలో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే జాక్వెలిన్ క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ప్ర‌త్యేక పాత్ర‌తో పాటు హాట్ ఐటం పాట‌లోనూ న‌ర్తిస్తుంది. త‌న‌ పాత్ర పేరు ర‌క్క‌మ్మ‌. ఇటీవ‌లే ఆ పాత్ర‌కు సంబంధించిన లుక్ ని కూడా యూనిట్ రిలీజ్ చేసింది. ర‌క్క‌మ్మ‌ని చాలా హాట్ గా ఎక్స్ ఫోజ్ చేసారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో సునామీలా దూసుకుపోతోంది.

ఆ ఒక్క పోస్ట‌ర్ తోనే కోట్లాది రూపాయ‌ల ప‌బ్లిసిటీ సునాయాసంగా ద‌క్కింది. జాక్వెలీన్ కు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల కార‌ణంగానే అది సాధ్యమైంది. ఇన్ స్టా.. ట్విట‌ర్ స‌హా ఎఫ్.బీల్లో పోస్ట‌ర్ బాగా రీచ్ అయింది. ఆ స‌మ‌యంలో నే `ర‌క్క‌మ్మ` రోల్ పై ఆస‌క్తిక‌రంగా స్పందించి మ‌రింత‌ క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని జాక్ మంజునాథ్- శాలిని మంజునాత్ నిర్మిస్తున్నారు.  మ‌రి తెలుగులో రిలీజ్ ఉంటుందా?  లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    
  • jaqueline fernandez 
  • Kicha Sudeep 
  • Bollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS