అమెరికా లో గ్యారేజ్ స్క్రీన్లకి టెండర్!!

Update: 2016-06-07 11:49 GMT
జనతా గ్యారేజ్ మూవీని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిన నాన్నకు ప్రేమతో తర్వాత చేస్తున్న మూవీ కావడం, తొలి రెండు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందడంతో.. జనతా గ్యారేజ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు స్థానిక మార్కెట్ తో సమానంగా యూఎస్ లో కూడా కలెక్షన్స్ వస్తుండడంపై.. ముందునుంచి ఇక్కడి జనాలకు నచ్చేలా ఎలిమెంట్స్  ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.

ఇందుకు కారణం మొత్తం కలెక్షన్లలో 10-20శాతం మేర ఓవర్సీస్ నుంచి రాబట్టుకునే అవకాశం ఉండడమే. అయితే జనతా గ్యారేజ్ కి అమెరికా కలెక్షన్స్ విషయంలో ఇప్పుడో టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం వచ్చిన అడ్డంకితో.. గ్యారేజ్ కి దొరికే థియేటర్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆగస్ట్ 12న జనతాగ్యారేజ్ ని రిలీజ్ చేస్తామని.. దర్శకుడు కొరటాల - హీరో ఎన్టీఆర్ లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అదే డేట్ న హృతిక్ రోషన్ మూవీ మహెంజొదారోను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో జనతా గ్యారేజ్ కి కేటాయించే థియేటర్ల సంఖ్యలో భారీగా కోత విధించే అవకాశాలు ఉన్నాయి.

పైగా లగాన్ - స్వదేశ్ వంటి చిత్రాలను తీసిన అశుతోష్ గోవార్కర్ డైరెక్షన్ లో మజెందారో వస్తుండడంతో మరింతగా క్రేజ్ పెరగనుంది. మరిప్పుడు థియేటర్లను ఇప్పటినుంచే బ్లాక్ చేస్తే మినహాయిచి, కావాల్సినన్ని థియేటర్లు దొరికే ఛాన్స్ ఉండదంటున్నారు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు. మరి నిర్మాతల ఆలోచన ఎలా ఉండనుందో చూడాలి.
Tags:    

Similar News