• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జన గణ మణ.. ఇక ఆపెయ్యండి

జన గణ మణ.. ఇక ఆపెయ్యండి

By - Tupaki Desk
Update: 2016-04-29 04:26 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలిసి.. పోకిరీ బాక్సాఫీస్ ని కుమ్మేసిన రోజు ఇదే. అందుకే అదే రోజున మహేష్ తో కొత్త సినిమా అంటూ.. 'జన గణ మన'  అనే టైటిల్ ని అనౌన్స్ చేశాడు పూరీ. ఈ టైటిల్ వినగానే ఇండస్ట్రీ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

జన గణ మన అనే టైటిల్ చాలా రోజులుగా ఇండస్ట్రీలో నానుతోంది. అప్పుడెప్పుడో  ఈ టైటిల్ పై పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడంటూ టాక్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కృష్ణ వంశీ కూడా ఓ దేశభక్తి సినిమా తీస్తాడని.. దానికి జనగణమన అనే టైటిల్ పెడుతున్నాడని అన్నారు కానీ.. అదేమయ్యిందో తెలీదు. రీసెంట్ గా జ్యోతి లక్ష్మి ఛార్మి కూడా జనగణమన ఓ దేశభక్తి సినిమా నిర్మిస్తోందని.. లీడ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోందని వార్తలొచ్చాయి. దీని సంగతి తేలలేదు.

అయితే.. కొన్ని నెలల క్రితం దిల్ రాజు జనగణమన అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కోసం ఈ టైటిల్ అని అంతా అనుకున్నారు. ఇన్ని రూమర్ల తర్వాత ఇప్పుటికి ఈ టైటిల్ పై ఓ క్లారిటీ వచ్చింది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా.. మహేష్ బాబుకి జన గణ మన అనే టైటిల్ ని కేటాయించాడు పూరీ జగన్నాథ్. మొత్తానికి టైటిల్ తోనే స్ట్రోక్ ఇచ్చిన పూరీ.. సినిమాతో ఇండస్ట్రీకి మాస్టర్ స్ట్రోక్ ఇస్తానని ధీమాగా ఉన్నాడు. మొత్తానికి ఇక 'జనగణమన' అనే టైటిల్ పై ఇక అందరూ రూమర్లు ఆపేసి.. సైలెంట్ అయిపోవచ్చు.
Tags:    
  • Mahesh Babu 
  • Puri Jagannath 
  • Telugu news 

Similar News

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS