మత్తుగా గమ్మత్తుగా ప్రేమికుల ప్రణయం జల జల జల..!
గందరగోళం గజిబిజి సంగీతానికి కాలం చెల్లింది. అనవసరంగా సంగీత హోరులో పదాలు కొట్టుకుపోతే వినేందుకు నేటి అభిరుచి తెలిసిన జనానికి మనసొప్పడం లేదు. అందుకు తగ్గట్టే నేటితరం దర్శకనిర్మాతలు కూడా ఆచితూచి లిరిసిస్టుల్ని ఎంపిక చేసుకుని ముందే సంగీత దర్శకులకు సూచనలిచ్చేస్తున్నట్టే కనిపిస్తోంది.
ఇటీవల గత కొంతకాలంగా తెలుగు సినిమా పాట మారుతున్న తీరు హర్షణీయం. నవతరం పాటల రచయితలు మ్యాజికల్ వర్డింగ్స్ తో మ్యాజిక్ చేస్తుంటే సీనియర్ సంగీత దర్శకులు ట్యూన్ ని కాస్త వినసొంపుగా వినిపించేందుకు పాకులాడుతున్నారు. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ - కృతి జంటగా నటించిన `ఉప్పెన` పాటల్లో ఇది ప్రతిబింబించింది.. లిరిక్ ప్రతిధ్వనించి ఆహ్లాదాన్ని పంచింది.
తాజాగా జల జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెల సెలయేరును నేను.. సల సల సల తాకితు నువ్వు..! లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో మ్యాజికల్ వర్డింగ్ తో శ్రీమణి వినసొంపైన లిరిక్ ని అందించగా.. దానికి అంతే సింపుల్ గా క్యాచీగా ట్యూన్ ని కట్టారు దేవీశ్రీ ప్రసాద్. అనవసర గజిబిజి గందరగోళం లేదెక్కడా. ఈ సినిమా పాటలు ఏ కోణంలో చూసినా ఉప్పెన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నాయే కానీ తుంచడం లేదని అర్థమవుతోంది.
పాటలో డెప్త్ కి తగ్గట్టే సముద్రపు అలలపైనా ఈ ప్రణయ గీతాన్ని చిత్రీకరించారు. ఒక అందమైన కవితను ప్రేమజంట ప్రణయ కావ్యాన్ని రచించడంలో శ్రీమణి ప్రతిసారీ మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. ``ఆకాశమంత ప్రణయం.. చుక్కలాంటి హృదయం`` అంటూ చక్కని పదాల్ని ఉపయోగించారు. అతి శయోక్తి లేని అందమైన వచన కవిత్వాన్ని అందించారనే చెప్పాలి. ఇక ట్యూన్ ని కొత్తగా ఉంచే కంటే మత్తుగా ఉంచేందుకే ప్రయత్నించారు దేవీశ్రీ. జస్ ప్రీత్ - శ్రేయా ఘోషల్ గానం అంతే ప్లెజెంట్ గా మైమరిపించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్ స్టోరీని అందించింది. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ కానుంది.
Full View