రష్మికపై జగిత్యాల కలెక్టర్ కామెంట్..అసలు కథ ఇదీ

Update: 2020-02-20 10:15 GMT
‘భరత్ అనే నేను ’ సినిమా విడుదలయ్యాక.. అందులో సీఎంగా గొప్పగా చేసిన మహేష్ బాబును మంత్రి కేటీఆర్ స్వయంగా అభినందించారు. ఆయన చిత్రానికి ప్రమోషన్ కూడా చేశారు. అభిమానం.. వేరు రాజకీయం వేరు అని చాటారు. ఢిల్లీకి రాజైనా అతడికి ఇష్టయిష్టాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కానీ ఇక్కడ ప్రమేయం లేకున్నా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కలెక్టర్ ను బుక్ చేశారు. కలెక్టర్ కామెంట్ చేయకున్నా.. ఆయన పేరుతో హ్యాకర్లు కామెంట్ చేసి వివాదం రాజేశారు. ఈ ఘటన వైరల్ గా మారింది.

తాజాగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ ఒకటి వచ్చింది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రష్మిక మందానా పెట్టిన హాట్ ఫొటోలకు ‘చించావ్ పో’ అంటూ జగిత్యాల కలెక్టర్ రవి ట్విట్టర్ నుంచి కామెంట్ పడింది. దీంతో కలెక్టర్ ఇలా హీరోయిన్ పై కామెంట్ చేయడం ఏంటని వివాదం మొదలైంది.

నిజానికి ఈ ట్వీట్ చేసింది జగిత్యాల కలెక్టర్ రవి కాదు.. అయినా ఈ నెపం ఆయనపై మోపారు. ఇదంతా హ్యాకర్లు చేసిన పన్నాగం.. ఈ వివాదంపై జగిత్యాల కలెక్టర్ రవి స్పందించారు. ‘తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని.. హీరోయిన్ రష్మికపై కామెంట్ చేసింది తాను కాదని’ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇలా హ్యాకర్లు చేసిన పనికి జగిత్యాల కలెక్టర్ అభాసుపాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది.
Tags:    

Similar News