కొత్త జంట‌కు 20 వ‌ర‌కే టైమిచ్చారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మికా మంద‌న్నా ఇటీవ‌లే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఉదంపూర్ లో వివాహం ఎంతో వైభవంగా జ‌రిగింది.;

Update: 2026-03-01 15:30 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మికా మంద‌న్నా ఇటీవ‌లే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఉదంపూర్ లో వివాహం ఎంతో వైభవంగా జ‌రిగింది. మార్చి 4న హైద‌రాబాద్ లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా హాజ‌ర‌వుతారు. ఈ కార్య‌క్ర‌మంతో వివాహ క్ర‌తువు పూర్త‌యిన‌ట్లే. అటుపై న‌వ‌దం ప‌తులు హానీమూన్ కోసం విదేశాలకు చెక్కేయ‌నున్నారు. ప్ర‌స్తుతం యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో దుబాయ్ లాంటి దేశాల‌కు వెళ్లే అవ‌కాశం లేదు. త‌మ‌కిష్ట‌మైన జ‌పాన్ లేదా మాల్దీవుల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.

అయితే న‌వ దంపతులు ఏం చేసినా మార్చి 20 లోగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే `ర‌ణ‌బాలి` షూటింగ్ తిరిగి మార్చి 20 నుంచి ప్రారంభం కానుంది. విజ‌య్ -ర‌ష్మిక ల పెళ్లి కార‌ణంగానే తాత్కాలికంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. విజ‌య్ లేని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నా? మేజ‌ర్ పార్ట్ అంతా విజ‌య్-ర‌ష్మిక‌లుంటేనే పూర్త‌వుతుంది. మార్చి 20 నుంచి విజ‌య్-ర‌ష్మిక‌లు హాజ‌రైతే వారిపైనే షూటింగ్ మొద‌ల‌వుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్య‌న్ సిద్దం చేస్తున్నాడు. ఇదీ భారీ షెడ్యూల్ అని స‌మాచారం.

సినిమాకు సంబంధించిన కీల‌క‌మైన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న్ స‌న్నివేశాలు ఇందులో షూట్ చేయ‌నున్నారుట‌. ఎట్టి ప‌రిస్థితుల్లో స‌మ్మ‌ర్ ముగిసేలోపు షూటింగ్ పూర్తి చేయాల‌ని రాహుల్ ప్లాన్. వేస‌వి కార‌ణంగా ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో షూటింగ్ హైద‌రాబాద్ లో కాకుండా శీత‌ల ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నారుట‌. భార‌త్ లోనే చ‌ల్ల‌గా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌త్యేక‌మైన సెట్లు వేసి పూర్తి చేసేలా ప్ర‌ణాళిక సిద్ద‌మ‌వుతుంది. బ్రిటీష్ ఇండియా నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో సెట్లు డిమాండ్ చేస్తున్నాయి. షూటింగ్ చాలా భాగం సెట్స్ లోనే చేస్తున్నారు.

ఇంత వ‌ర‌ర‌కూ టీమ్ విదేశాల్లో షూటింగ్ చేసింది లేదు. అలాగే విజ‌య్ ఈ సినిమాతో పాటు రౌడీ జ‌నార్ద‌న్ షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేయాలి. ఈ సినిమా కంటే ముందే ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని బ‌య‌ట‌కు రావాలి. ర‌ష్మిక కూడా చాలా సినిమా షూటింగ్ లు పూర్తి చేయాలి. `ర‌ణ‌బాలి` తో పాటు ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో `మైసా` తెర‌కెక్కుతోంది. అలాగే బాలీవుడ్ లో `కాక్ టెయిల్ 2` లోనూ న‌టిస్తోంది. ఇంకొన్ని కొత్త క‌మిట్ మెంట్లు ఉన్నాయి. వాటిని వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ కు తీసుకెళ్లాలి అంటే సెట్స్ లో ఉన్న చిత్రాల‌న్ని షూటింగ్ పూర్త‌యితేనే సాధ్య‌మ‌వుతుంది. తాజాగా ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టింది కాబ‌ట్టి షూటింగ్ స్పీడ్ త‌గ్గించే అవ‌కాశం ఉంది. ఫ్యామిలీ లైప్ తో పాటు సినిమాల్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News