ఫోటో స్టోరి: థై సొగసుల పొట్టి మిడీలో టీజింగ్ భంగిమలు
సినిమా గ్లామర్ ప్రపంచంలో ఒడిదుడుకులు సహజం, కానీ ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం అత్యంత నాటకీయంగా ఉన్నాయి.;
సినిమా గ్లామర్ ప్రపంచంలో ఒడిదుడుకులు సహజం, కానీ ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం అత్యంత నాటకీయంగా ఉన్నాయి. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కోర్టు గొడవలు, మరోవైపు కెరీర్ డైలమా తనను ఇరకాటంలో పెడుతున్నా కానీ.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది. తాజాగా పిక్కల పైకి తేలిపోయే పొట్టి మిడీ ధరించి, తన థై అందాలను ప్రదర్శిస్తూ ఇచ్చిన భంగిమలు నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
ఈ భామ పర్సనల్ లైఫ్ చూస్తే ఏదో సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది. ప్రియుడు జైలు గోడల మధ్య నుంచే ఈమె కోసం ప్రేమ కవితలు రాస్తున్నాడు. కేవలం కవితలతోనే సరిపెట్టకుండా, తన `ప్యారీ` కోసం ఒక ఏకాంత ద్వీపాన్ని (ఐల్యాండ్) కొని బహుమతిగా ఇస్తానని, ప్రయాణాల కోసం ఒక ప్రైవేట్ జెట్‌నే కానుకగా ఇస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం ఆమెకు అందస్తానని అతడు చెబుతుంటే.. చట్టపరమైన చిక్కులు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి.
ఇన్ని వివాదాల మధ్య ఉన్నా.. ఈ సుందరి తన కెరీర్ విషయంలో చూపిస్తున్న ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. చేతిలో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోయినా, తన ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. నెటిజన్లను కట్టిపడేసేలా `గాట్ ది బటర్ ఫ్లైస్` అంటూ షేర్ చేసిన తాజా ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. పొట్టి దుస్తుల్లో ఈ కిరాక్ బ్యూటీ ఇస్తున్న ట్రీట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
నిజానికి ఈ భామ ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. అటు జైలు పక్షిలాంటి ప్రియుడి నుంచి అందుతున్న విలాసవంతమైన ఆఫర్లు, ఇటు కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టుకోవాలనే ఆరాటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా జీవితంలో ఎన్ని ఉన్నా డీలా పడిపోకుండా నిరంతరం జిమ్ వర్కవుట్లు, ఫోటోషూట్లతో నిరంతరాయంగా తన ఫాలోవర్లకు వినోదాన్ని పంచుతోంది. గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఇన్ని కష్టాలు తప్పవని ఆమె తీరు చూస్తుంటే అర్థమవుతోంది.
కోర్టు మెట్లు ఎక్కడం, విచారణలను ఎదుర్కోవడం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి గ్లామర్ మెయింటైన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. తన అందచందాలతో సోషల్ మీడియాను రచ్చ రచ్చ చేస్తున్న ఈ భామ మునుముందు తన కెరీర్‌ను ఎలా మలుచుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పొట్టి మిడీ ఫోటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.