• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పోలికేంటి జ‌గ్గూభాయ్‌!

ఆ పోలికేంటి జ‌గ్గూభాయ్‌!

By - Tupaki Desk
Update: 2015-08-13 05:48 GMT
`శ్రీమంతుడు`కీ, `శుభ‌ల‌గ్నం`కీ ఏమైనా పోలికా?  కానీ జ‌గప‌తిబాబు మాత్రం ఆ రెండు సినిమాల్నీ ఓ గాట‌న క‌ట్టేశాడు.  అదెలాగంటే శుభ‌ల‌గ్నం కూడా వ‌ర్షాకాలంలో విడుద‌లైంద‌ట‌. వ‌ర‌ద‌ల్ని కూడా లెక్క చేయ‌కుండా ప్రేక్ష‌కులు ఆ సినిమాని హిట్ చేశార‌ట‌. అది నిజ‌మే కావొచ్చు కానీ... ఇప్పుడస‌లు  వ‌ర‌ద‌లు సంగతి ప‌క్క‌నెడ‌తాం, వ‌ర్షాలే లేవు క‌దా! కానీ జ‌గ్గూభాయ్ మాత్రం `శ్రీమంతుడు` హిట్టు అని చెప్పేందుకు, ఇలాంటి సమ‌యంలోనే త‌న `శుభ‌ల‌గ్నం` కూడా వ‌చ్చింద‌ని గుర్తు చేసుకొనేందుకు  వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ట్టు క‌ల‌గ‌న్నాడు. అద‌న్న‌మాట సంగ‌తి.

శ్రీమంతుడు`లో  మ‌హేష్‌ కి తండ్రిగా న‌టించాడు జ‌గ‌ప‌తిబాబు. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టాక జ‌గ్గూభాయ్‌ కి వ‌చ్చిన హిట్ల‌లో శ్రీమంతుడు ఒక‌టి. మ‌హేష్‌ కి తండ్రి పాత్ర‌లో ఒదిగిపోయాడు. జ‌గప‌తిబాబు కూడా ఓ హీరోనే కాబ‌ట్టి ఆయ‌న కూడా అందంగానే ఉంటాడు. తెల్ల‌ గెడ్డం తీసేస్తే సినిమాలో ఈయ‌న విల‌నా హీరోనా? అని ఆశ్చ‌ర్య‌పోతారు ప్రేక్ష‌కులు. అందుకే మ‌హేష్‌ లాంటి అంద‌గాడికి తండ్రిగా జ‌గ‌ప‌తిబాబు చాలా బాగా కుదిరాడు. `శ్రీమంతుడు` విష‌యంలో ఆయ‌న చాలా హ్యాపీగా ఉన్నాడు.

 ఇన్నాళ్లూ విల‌న్ పాత్ర‌ల‌కోస‌మే త‌న ద‌గ్గ‌రికొచ్చే ద‌ర్శ‌కులు ఇక నుంచి తండ్రి పాత్ర‌ల కోసం కూడా వ‌స్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఆ ఆనందం ఆయ‌న‌లో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఎంత విల‌న్‌ గా మారినా, ఎంత తండ్రి పాత్ర‌ల్లో న‌టిస్తున్నా ఆయ‌న్ని నేటికీ ప్రేక్ష‌కులు ఓ హీరోలాగానే చూస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కూడా త‌న సినిమాల్ని ఇలా అప్పుడ‌ప్పుడు గుర్తుకు తెచ్చుకొంటూ తాను హీరోని అన్న విష‌యం గుర్తు చేస్తున్నాడు.
Tags:    
  • Mahesh babu 
  • Jagapathi babu 
  • Srimanthudu Movie 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS