• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరుకి జగపతి బాబు...

చిరుకి జగపతి బాబు వెన్నుపోటు

By - Tupaki Desk
Update: 2017-12-29 13:18 GMT
సైరా నరసింహారెడ్డి మొదటి షెడ్యూల్ అయితే పూర్తి చేసారు కాని అందులో చిరంజీవి తప్ప లీడ్ యాక్టర్స్ ఎవరు అందులో పాల్గొనలేదు. అసలైన తారాగణం సెకండ్ షెడ్యూల్ నుంచి ఎంటర్ కానున్నారు. చిరు కాకుండా ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపుతున్న పాత్రలు విజయ్ సేతుపతి - జగపతి బాబు - అమితాబ్ బచ్చన్ లవి. నరసింహరెడ్డికి అత్యంత విధేయుడిగా ఉంటూ కంటికి రెప్పలా కాపలా కాసే పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు అనే టాక్ ఉండగా ఇప్పుడు జగపతి బాబుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించి ఆ తలను కొన్నేళ్ళ పాటు అలాగే కోట గుమ్మానికి వేలాడగట్టిన చరిత్ర అందరికి తెలిసిందే. కాని నరసింహారెడ్డి బ్రిటిషర్లకు పట్టుబడటం వెనుక స్వామి ద్రోహుల పాత్రే ఎక్కువగా ఉంది. వాళ్ళలో ఒక కీలకమైన వెన్నుపోటు దారుడి పాత్రే జగపతి బాబు పోషిస్తున్నట్టు తెలిసింది.

పాత్ర పేరు ఏమిటి అనేది బయటికి రాలేదు కాని విజయ్ సేతుపతి - జగపతి బాబు ఇద్దరు నరసింహరెడ్డి టీంలోనే ఉంటూ ఒకరు సహాయం ఒకరు ద్రోహం చేసే పాత్రల్లో పోటాపోటీగా ఉంటారట. బాలకృష్ణ లెజెండ్ లో విలన్ గా నటించిన జగ్గు తక్కువ గ్యాప్ లోనే చిరు సినిమాలో కూడా విలన్ గా నటించే అవకాశం రావడం విశేషమే. వచ్చే నెల ప్రారంభం కానున్న షెడ్యూల్ లో జగ్గు పాత్రకు సంబంధించిన సీన్స్ షూటింగ్ ఉంటుందట. చిరు తనయుడు రామ్ చరణ్ రంగస్థలంలో విలన్ గా చేస్తూ మరోపక్క చరణ్ తండ్రి సినిమాలో కూడా విలన్ గా చేయటం అనే అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు జగ్గు. సైరా అనుకున్నట్టు టైం ప్రకారం షూటింగ్ జరిగితే కనక 2019 సంక్రాంతి బరిలో ఉంటుంది. లేదంటే ఆ సంవత్సరపు సమ్మర్ కు వెళ్ళక తప్పదు.
Tags:    
  • Jagapathi Babu 
  • Chiranjeevi 
  • Sye Raa Narasimha Reddy Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS