జగపతి.. క్యాసినో.. ఓ 30 లక్షలు

Update: 2015-08-04 13:52 GMT
గాయం.. శుభ లగ్నం.. సముద్రం.. జగపతి బాబు ఎంత విలక్షణమైన హీరోను ఈ  సినిమాల్ని బట్టి చెప్పేయొచ్చు. లెజెండ్, కరెంటు తీగ, పిల్లా నువ్వు లేని జీవితం.. హీరో వేషాలకు తెరపడ్డాక జగపతి విలక్షణతను చాటిచెప్పే సినిమాలివి. ఐతే సినిమాల్లనే కాదు.. నిజజీవితంలోనూ జగపతి చాలా విలక్షణమైన మనిషి అని ఒప్పుకుని తీరాల్సిందే. మిగతా సినీ సెలెబ్రెటీస్ కు చాలా భిన్నంగా ఉంటారాయన. అమెరికా అబ్బాయిని అల్లుడిగా చేసుకోవడంలోనూ ఆ విలక్షణతే చూపించారు. ఇవన్నీ పక్కనబెడితే.. జగపతి డబ్బుకు అస్సలు విలువివ్వరని.. తండ్రి వారసత్వంగా ఇచ్చిన ఆస్తినంగా హారతి కర్పూరం చేసేశాడని.. క్యాసినోల్లో చాలా పోగొట్టుకున్నాడని ఆయన మీద రకరకాల ఊహాగానాలు హల్ చల్ చేశాయి. దీని గురించే జగపతి దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఆ సంగతేంటో ఆయన మాటల్లోనే విందాం పదండి.

‘‘నాకు డబ్బు పొదుపు చెయ్యడం తెలియదు. తెలిసిన వారెవరికైనా సమస్యలతో హాస్పిటల్లో చేరారంటే డాక్టర్ కి ఫోన్ చేసి బిల్లు ఇంటికి పంపించమని అడగడం.. సినిమా పోతే నిర్మాతలకు డబ్బులివ్వడం.. ఇలాంటివి చాలా చేశా. అదంతా నాకిష్టమై చేసిందే. ఇవన్నీ వదిలేసి నేనేదో క్యాసినోల్లో పేకాట ఆడి డబ్బులు పోగొట్టేశానని ప్రచారాలు చేశారు. వాళ్ల గురించి నేను పట్టించుకోను. నేను క్యాసినోలకు వెళ్లనని అబద్ధం చెప్పను. కానీ నా ఆస్తి అందులో పోగొట్టానని అనడం సరి కాదు. నా సరదా కోసం ఏదో 20-30 లక్షలు ఖర్చు పెట్టుకున్నానంతే. వంద సినిమాలు చేసి సంపాదించినవాడికి అవి పెద్ద లెక్క కాదుగా. ఇన్నాళ్లూ నేను డబ్బు పొదుపు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తున్నా. నా భార్య, ఇద్దరమ్మాయి ఉన్నదాంతో సరిపెట్టుకుందామనే టైపు’’ అని వివరించాడు జగపతి.
Tags:    

Similar News