• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా కంటే జబర్దస్త్‌...

తమన్నా కంటే జబర్దస్త్‌ అనసూయ చాలా బెటర్‌!!

By - Tupaki Desk
Update: 2021-10-30 16:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా మొదటి సారి హోస్ట్‌ గా వ్యవహరించిన మాస్టర్‌ చెఫ్‌ షో జెమిని టీవీలో టెలికాస్ట్‌ అవుతున్న విషయం తెల్సిందే. మొదటి సీజన్ పూర్తి అవ్వకుండానే తమన్నాను తొలగించి మద్యలో జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయను తీసుకు రావడం చర్చనీయాంశం అయ్యింది. తమన్నాను తొలగించిన విషయం ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఒక వైపు జెమిని టీవీ వారు షో నిర్వాహకులు తమ తొలగింపును సమర్ధించుకుంటూ ఉంటే మరో వైపు తమన్నా తనకు నష్టం వాటిల్లింది.. అందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తుంది. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో తెలియదు కాని హోస్ట్‌ చేంజ్‌ అవ్వడం మాస్టర్‌ చెఫ్ కు కొత్త ఉత్సాహంను తెచ్చినట్లుగా అనిపిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తమన్నా హోస్ట్‌ గా చేసిన సమయంలో కంటే అనసూయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ షో కు మంచి రేటింగ్‌ వస్తుందని నిర్వాహకులు మరియు జెమిని టీవీ వర్గాల వారు ఆఫ్‌ ది రికార్డ్‌ అంటున్నారు. తమన్నా కు ఇచ్చిన పారితోషికంలో అనసూయకు ఇస్తున్న పారితోషికం చాలా తక్కువ. అలా కొంత మొత్తం షో నిర్వాహకులకు మిగలడంతో పాటు రేటింగ్‌ కూడా పెరగడంతో బ్రాండ్స్ ద్వారా వచ్చే మొత్తం కూడా పెరుగుతుంది. అలా షో నిర్వాహకులు ఆర్థికంగా చాలా సంతృప్తికరంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అనసూయ తనదైన స్టైల్‌ లో ఈ షో ను నడిపిస్తూ ఉంది. తమన్నాకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక మాట చెప్పాలంటే తమన్నాను మించి ఈ షో ను ఆసక్తికరంగా ఎంటర్‌ టైన్ మెంట్‌ తో జబర్దస్త్‌ గా రన్ చేస్తుందని ప్రేక్షకులు అంటున్నారు.

బుల్లి తెరపై తనకు తిరుగు లేదు.. తాను జబర్దస్త్‌ యాంకర్ ని అని మరోసారి హాట్ అనసూయ నిరూపించుకుంది. మాస్టర్‌ చెఫ్‌ షో ను మద్యలో ముగించాలని భావిస్తున్న సమయంలో అనసూయ ఎంట్రీ తో మంచి రేటింగ్‌ దక్కడంతో ముందుగా అనుకున్న ప్రకారం కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ వ్యవహారం మొత్తం తమన్నాకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. వెండి తెరపై ఆమె సూపర్‌ స్టార్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికి ఆమె సినిమా ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఆమెను జనాలు బుల్లి తెరపై మాత్రం పెద్దగా ఆధరించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే మాస్టర్ చెఫ్‌ కు తమన్నా హోస్ట్‌ గా వ్యవహరించిన సమయంలో రేటింగ్‌ చాలా తక్కువగా వచ్చిందని.. బుల్లి తెర స్టార్‌ జబర్దస్త్‌ అనసూయ హోస్ట్ చేసినప్పుడు మాత్రం మంచి రేటింగ్‌ వస్తుందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బుల్లి తెర షో ల విషయంలో తమన్నాతో పోల్చితే అనసూయ చాలా బెటర్‌ అని దీంతో నిరూపింతం అయ్యిందనే వారు చాలా మంది ఉన్నారు. ఒక వైపు సినిమాలు మరో వైపు ఇలాంటి బుల్లి తెర షో లతో జబర్దస్త్‌ అనసూయ సూపర్‌ ఫామ్ లో దూసుకు పోతుంది.
Tags:    
  • Tamanna 
  • F2 
  • Master Chef 
  • Web series 
  • Anasuya Bharadwaj 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS