• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓవర్ టు మహేష్ అండ్ బన్నీ

ఓవర్ టు మహేష్ అండ్ బన్నీ

By - Tupaki Desk
Update: 2018-04-04 07:58 GMT
మొత్తానికి టాలీవుడ్ ఎట్టకేలకు ఒక పెద్ద హిట్ అందుకుంది. సంక్రాంతి సినిమాలు నిరాశకు గురి చేయగా.. వేసవి సీజన్లో వచ్చిన తొలి భారీ సినిమా ‘రంగస్థలం’ అంచనాల్ని మించిన విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి వారాంతంలోనే రూ.50 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యే దిశగా పరుగులు పెడుతోంది. ‘మగధీర’ వసూళ్ల రికార్డును ఇది అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుమించి ఈ చిత్రం ఏ స్థాయికి వెళ్తుందో కానీ.. చరణ్ అండ్ కో అయితే చాలా సంతృప్తిగా ఉన్నట్లే కనిపిస్తోంది. మొత్తానికి చరణ్ అయితే బాక్సాఫీస్ టెస్టులో డిస్టింక్షన్లో పాసయ్యాడనే చెప్పాలి. ఇక సమ్మర్ బరిలో ఉన్న మహేష్ బాబు.. అల్లు అర్జున్ ల సంగతే తేలాల్సి ఉంది.

ఇంకో నెల రోజుల వ్యవధిలోనే మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’.. అల్లు అర్జున్ మూవీ ‘నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల మీదా భారీ అంచనాలే ఉన్నాయి. అవి అంచనాలకు తగ్గట్లు ఉంటే ఆ ఇద్దరు హీరోల కెరీర్లో అతి పెద్ద హిట్లుగా నిలవడం.. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ఏప్రిల్ 20న రాబోతున్న ‘భరత్ అనే నేను’ స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని అందరూ అంచనా వేస్తున్నారు. కొరటాల శివ ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్లే కావడం.. మహేష్ తో చేసిన ‘శ్రీమంతుడు’ నాన్-బాహుబలి రికార్డులు నెలకొల్పడంతో ‘భరత్ అనే నేను’పై కాన్ఫిడెన్స్ పెంచుతోంది. ఇక ‘నా పేరు సూర్య’ విషయానికొస్తే ఈ చిత్ర ప్రోమోలు సినిమాపై చాలా అంచనాల్ని పెంచేశాయి. రచయితగా భారీ విజయాలు అందుకున్న వక్కంతం వంశీ.. దర్శకుడిగా తాను తీస్తున్న తొలి సినిమా విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటాడని.. ఈ సినిమా కూడా నిరాశ పరచదని అభిమానులు ఆశతో ఉన్నారు. మరి మహేష్.. బన్నీ బాక్సాఫీస్ పరీక్షలో ఎలాంటి ఫలితాలనందుకుంటారో చూడాలి.
 
Tags:    
  • Mahesh babu 
  • Bharat Ane Nenu 
  • Allu Arjun 
  • Naa Peru Surya 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS