• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప... ఇది మా సూపర్...

పుష్ప... ఇది మా సూపర్ స్టార్స్ కు అవమానం

By - Tupaki Desk
Update: 2022-01-05 07:30 GMT
బాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకే కాకుండా సౌత్ సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు కమల్ ఆర్ ఖాన్‌. తనకు తాను నటుడిని ఫిల్మ్‌ మేకర్ ని అని చెప్పుకునే ఈ సినీ విమర్శకుడు గతంలో మన సౌత్ సినిమాలపై బ్యాడ్ కామెంట్స్ చేయడం.. నెగటివ్ రివ్యూలు ఇవ్వడం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఆర్జీవీ రేంజ్ లో వివాదాలతో ఆట ఆడుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే సల్మాన్ ఖాన్‌ రాధే సినిమా పై చేసిన వ్యాఖ్యలకు.. ఇచ్చిన రివ్యూకు ఇంకా కూడా పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే కోర్టు నోటీసు అందుకున్న ఈయన దాన్ని కూడా పబ్లిసిటీ కోసం తన ప్రమోషన్ కోసం వాడుకుని సల్మాన్ ఖాన్‌ ను టార్గెట్‌ చేయడం జరిగింది. తాజాగా ఈయన పుష్ప గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

ఈమద్య ఎక్కువ బాలీవుడ్‌ సినిమాల గురించే ఈయన మాట్లాడుతున్నాడు. ఇటీవల హిందీలో కూడా విడుదల అయిన పుష్ప సినిమా ను గురించి రెండు వారాల వరకు ఈయన పట్టించుకోలేదు. మూడవ వారంలో తనను అందరు పుష్ప రివ్యూ చేయమని కోరుతున్నారు వీలుంటే సినిమా ను పంపించు బన్నీ అంటూ ట్వీట్‌ చేశాడు. థియేటర్ లో ఉన్న సినిమా లింక్ ను పంపించడం ఏంట్రా బాబు అంటూ కొందరు ట్రోల్స్ చేశారు. సరే ఏదో విధంగా సినిమా చూసిన ఈ కమల్ ఆర్ ఖాన్‌ పుష్ప పై అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా వసూళ్ల విషయంలో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలం.. సూపర్‌ స్టార్‌ హీరోలం అంటూ చెప్పుకునే వారికి ఇంతకంటే అవమానం ఉండదు అన్నట్లుగా ట్వీట్‌ చేశాడు.

ఆయన ట్వీట్ పూర్తి సారాంశం... సౌత్‌ డబ్బింగ్‌ మూవీ పుష్ప రూ. 60 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ హిందీలో కూడా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. బాలీవుడ్ కు చెందిన సూపర్‌ స్టార్‌ లు ఎవరైతే 15 నుండి 25 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేక పోయారో వారికి ఇది అతి పెద్ద అవమానం అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. అల్లు అర్జున్‌ ను ప్రశంసించడం బాగానే ఉంది కాని బాలీవుడ్‌ స్టార్స్ ను విమర్శించడం పై ఆయన్ను కొందరు ఎప్పటిలాగే టార్గెట్‌ చేసి బండ బూతులు తిట్టేస్తున్నారు. పుష్ప సినిమా కు ఆయన రివ్యూతో మరింత బూస్టింగ్ దక్కినట్లయ్యింది.

బాలీవుడ్ నుండి ఇతర సినిమా లు ఏమీ లేక పోవడంతో ఉత్తరాది ప్రేక్షకులకు పుష్ప సినిమా నే ఇప్పుడు దిక్కు అయ్యింది. అందుకే మరో వారం రెండు వారాల వరకు అక్కడ పుష్ప సినిమా ఒక మోస్తరు నుండి మంచి వసూళ్ల వరకు రాబడుతూ రన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అందుకే హిందీ వర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ ను వాయిదా వేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. పుష్ప సినిమా కు కమల్‌ ఆర్ ఖాన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఇతర భాషల ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఫిదా అయినట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా మహేష్‌ బాబు కూడా పుష్ప సినిమా విజయంకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే.








Full View
Full ViewFull View
Tags:    
  • mahesh babu 
  • Kamaal R Khan Pushpa 
  • allu arjun 
  • samantha 
  • Fahad Fazil 
  • Rashmika Mandanna 
  • pushpa songs 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS