ట్రైలర్ టాక్: ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావాలంటున్న 'మారేడుమిల్లి ప్రజానీకం'
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం మారేడుమిల్లిలో విడుదల చేసింది.
'ఇంకో నాలుగు రోజుల్లో మీ ఊర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి' అనే అల్లరి నరేశ్ డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు మారుమూల ప్రాంతంలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే ప్రభుత్వ అధికారి పాత్రలో అల్లరి నరేశ్ కనిపించారు.
ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి, సజావుగా ఎన్నికలు నిర్వహించాలని వెళ్ళిన అధికారి.. కనీస వసతులు - సరైన రోడ్డు మార్గం లేని మారేడిమిల్లి వాసుల సమస్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారు పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరక్కుండా చూస్తున్నారని తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో మారేడు మిల్లి ప్రజానీకం హక్కుల కోసం పోరాడేందుకు ముందుకు వచ్చిన నరేష్.. రాజకీయ నేతలు మరియు పోలీసుల ఆగ్రహానికి గురవుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. గత చిత్రం 'నాంది' మాదిరిగానే.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కూడా సీరియస్ సబ్జెక్ట్ తో వ్యవహరించే సోషల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం కలిగిన సిన్సియర్ సెన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా అల్లరి నరేశ్ ఆకట్టుకున్నారు. పల్లెటూరి అమ్మాయిగా ఆనంది అందంగా కనిపించింది. వెన్నెల కిషోర్ - ప్రవీణ్ - శ్రీ తేజ్ - సంపత్ రాజ్ - రఘు బాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి.. ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు', 'సాయం చెయ్యమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి' 'అన్యాయంగా బెదిరించేవాడికన్నా.. న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు', 'మన దేశం బాగుపడాలంటే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావాలి' వంటి డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ఓవరాల్ గా IMP ట్రైలర్ గ్రిప్పింగ్ గా.. సీరియస్ గా, సిన్సియర్ గా ఉంది. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూర్చగా.. అబ్బూరి రవి సంభాషణలు రాసారు. రాంరెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేశారు.
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాన్ని నవంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Full View