త్రివిక్రమ్‌ పై ఐటం సాంగ్‌ ఒత్తిడి... సరే అంటాడా?

Update: 2022-10-02 01:30 GMT
సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమా మొదటి షెడ్యూల్‌ ను ఇటీవలే ముగించారు. దసరా తర్వాత రెండవ షెడ్యూల్‌ కు సంబంధించిన షూటింగ్ పునః ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. దసరాకు సినిమా యొక్క ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ను కూడా ఇస్తారంటూ వార్తలు వచ్చాయి.

ఇటీవలే మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి గారు మృతి చెందారు. దాంతో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా దసరా సర్ ప్రైజ్‌ ఏమీ ఉండక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఐతే ఈ ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటున్న నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఐటం సాంగ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నాగ వంశీ నిర్మాణంలో రూపొందిన స్వాతిముత్యం సినిమా ఈ దసరాకి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. స్వాతిముత్యం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా గురించి స్పందించాడు.

అభిమానులతో పాటు యూనిట్‌ సభ్యుల్లో చాలా మంది ఈ సినిమాలో ఐటం సాంగ్‌ ఉండాలని కోరుకుంటున్నారు. ఆ విషయమై త్రివిక్రమ్‌ గారికి విజ్ఞప్తి చేశాం. ఒక మంచి మాస్ ఐటం సాంగ్ కావాలని చేస్తున్న డిమాండ్‌ విషయంలో త్రివిక్రమ్‌ ఆలోచనలో పడ్డారు అనేది నాగవంశీ మాటలు.

ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ తన సినిమాల్లో ఐటం సాంగ్‌ జోలికి వెళ్లలేదు. సెకండ్‌ హీరోయిన్‌ కామన్‌ గా ఉంటున్నట్లుగానే ఐటం సాంగ్ లేక పోవడం త్రివిక్రమ్‌ సినిమాలో కామన్‌ గా జరుగుతుంది. ఇప్పుడు అ సెంటిమెంట్‌ ను బ్రేక్ చేసి టైటిల్‌ ను పెట్టాలని భావిస్తున్న త్రివిక్రమ్‌ ఐటెం సాంగ్ విషయంలో కూడా తన సెంటిమెంట్‌ ను బ్రేక్ చేస్తే పోయేదేముంది అన్నట్లుగా త్రివిక్రమ్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News