• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐట‌మ్ గాళ్ అంటే...

ఐట‌మ్ గాళ్ అంటే అంగీక‌రించ‌ని అన‌సూయ‌

By - Tupaki Desk
Update: 2021-03-02 17:30 GMT
కార్తికేయ న‌టించిన `చావు క‌బురు చ‌ల్ల‌గా` త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ నుంచి ఓ స్పెష‌ల్ ఐటెమ్ నంబ‌ర్ రిలీజై యూట్యూబ్ ని షేక్ చేసింది. దానికి కార‌ణం ఆ పాట‌లో న‌ర్తించిన అన‌సూయ అంద‌చందాలు అభిన‌యం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అన‌సూయ‌- కార్తికేయ జంటపై `పైన ప‌టారం..` సాంగ్ ఒక్క‌సారిగా వేడి పెంచింది.

అయితే ఇలా ఐటమ్ నంబ‌ర్ లో డ్యాన్సులు చేశారేమిటి? అన్న ప్ర‌శ్న ఓ అభిమాని నుంచి ఎదురైంది. అయితే ఆ పాట‌ను ఐటమ్ నంబ‌ర్ అనేందుకు అన‌సూయ ఎంత‌మాత్రం అంగీక‌రించ‌లేదు స‌రిక‌దా.. అది స్పెష‌లో సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ప్రత్యేక పాటల్లో క‌నిపించ‌న‌ని ఎప్పుడూ అన‌లేదు. అయితే వాటిని `ఐటమ్ సాంగ్స్` అని పిలవడానికి తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేసారు. ఐటెమ్ గర్ల్ ‌గా గుర్తింపు పొందడం త‌న‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేదని దానిని బ‌ట్టి అర్థ‌మైంది.  

``అది ఐటెమ్ సాంగ్ కాదు అస‌లు.. ఐటెమ్ సాంగ్ అనేది ఏదీ లేద‌మ్మా.. ఒక పాట‌కి ఉన్న కాస్ట్ కాకుండా స్పెష‌ల్ గా ఎవ‌ర‌న్నా కావాలి అనుకున్న‌ప్పుడు `స్పెష‌ల్` సాంగ్ అనాలి! అంటూ తెలివిగా క్లాస్ తీస్కున్నారు అన‌సూయ‌. ఒక‌ప్పుడు అమ్మాయిని వ‌స్తువులా ట్రీట్ చేసేవాళ్లు.. అప్పుడు ఇచ్చిన పేరు అది. ఆ లిరిక్ వ్యాల్యు వ‌ల్ల‌నే ఈ స్పెష‌ల్ సాంగ్ కి ఒప్పుకున్నాను! అని కూడా అన‌సూయ అన్నారు.

అయితే అన‌సూయ ఎంతగా స‌ర్ధి చెబుదామ‌న్నా.. ఆ లిరిక్ లో ఉప‌యోగించిన ఘాటైన ప‌ద‌జాలం.. కొరియోగ్ర‌ఫీ విధానం.. ఎక్స్ ప్రెష‌న్స్ ఇవ‌న్నీ ఐటెమ్ నంబ‌ర్ కి ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    
  • Anasuya 
  • Item Songs 
  • anchor Anasuya Bharadwaj 
  • Jabardasth 
  • Rangasthalam 
  • Kshanam 
  • Anasuya Movies 
  • Anasuya Upcoming Movies 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS