'ఎఫ్‌3' అప్ డేట్‌ తెలిస్తే షాక్ అవుతారు

Update: 2021-04-04 03:52 GMT
గత ఏడాది కాలంగా ఎఫ్‌ 3 కి సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. సరిలేరు నీకెవ్వరు సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యింది. ఆ సినిమా దర్శకుడు అనీల్‌ రావిపూడి అప్పటి నుండి ఎఫ్‌ 3 సినిమాను ఊరిస్తూ వచ్చాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. కొన్ని వారాల క్రితమే సినిమాను పట్టాలెక్కించారు. వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లు షూటింగ్‌ లో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే ఆన్ లొకేషన్‌ ఫొటోలు కొన్ని వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. అది అస్సలు నమ్మ శక్యంగా లేదు అంటున్నారు. ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ మేజర్‌ పార్ట్‌ షూటింగ్ ను ముగించారట. అనుకున్నదాని కంటే చాలా స్పీడ్‌ గా షూటింగ్‌ జరుగుతుందని అంటున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్‌ మరియు రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ ను పూర్తి చేసుకుందట. బ్యాలన్స్ షూటింగ్‌ ను కూడా వచ్చే నెల వరకు పూర్తి చేసే యోచనలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే సినిమాను ఆగస్టు 27న విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ మే లోనే పూర్తి అవ్వనుంది కనుక విడుదల తేదీ ఏమైనా ముందుకు జరిపే అవకాశం ఉందా అనేది చూడాలి.  ఇప్పటికే జూన్ జులై సినిమాల జాబితా ఫిల్‌ అయ్యింది. కనుక ఎఫ్‌ 3 మెల్లగా ఆగస్టులోనే మొదట అనుకున్నట్లుగా రావడం బెటర్‌ అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News