దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం..కరోనాతో ఇషాన్ ఖాన్ కన్నుమూత

Update: 2020-09-03 05:45 GMT
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ కరోనా  బారినపడి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఆయన ఇదివరకే గుండెజబ్బు, రక్తపోటు,  అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతుండగా.. కరోనా  సోకడంతో పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెలలో దిలిప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్,  ఇషాన్  ఖాన్ లకు కరోనా సోకడంతో లీలావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. గుండె జబ్బు,  అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న అస్లాం ఖాన్ కొద్ది రోజుల కిందటే మరణించాడు.

 ఇషాన్  ఖాన్ కు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా విషమించడంతో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశాడు.  గత నెలలోనే అస్లాం ఖాన్ చనిపోగా, ఇప్పుడు ఇషాన్  ఖాన్ కూడా కన్నుమూయడంతో దిలీప్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. కరోనా కారణంగా ఒక నెల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇషాన్  ఖాన్ మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కరోనా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి బాలీవుడ్  ప్రముఖుల ఇంట విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఆస్పత్రుల పాలవగా కొందరు కన్నుమూశారు. గత నెలలో ఒక్క అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలోనే ఆయనతో పాటు కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్యరాయ్, మనుమరాలు ఆరాధ్య కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారంతా కోలుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Tags:    

Similar News