నెక్స్ట్ చేయబోయే సినిమా హింట్ ఇచ్చిన దేవరకొండ...!

Update: 2020-05-13 01:30 GMT
సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం'తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు వరుసగా ప్లాపులు రావడంతో కొంచెం వెనుకబడిపోయాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫైటర్' సినిమాలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమాని పూరీ - కరణ్ జోహార్ - ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఫైటర్' కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నారు. 'డియ‌ర్ కామ్రేడ్‌' 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' సినిమాలు దెబ్బ తిన‌డంతో 'ఫైటర్'పైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. కాగా గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా.. దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ హింట్ కూడా ఇచ్చేశాడు.

విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వారిలో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కూడా ఉన్నారు. ''ఈ ఏడాది నువ్వు మంచి సినిమాలు ఇంకా చేయాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని ట్వీట్ చేశారు. దీనికి బదులుగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. ''థ్యాంక్స్.. నాకు తెలుసు.. అయితే ఆ అద్భుతం మనమిద్దరం కలిసి చేయబోతున్నాం'' అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ తో వీరిద్దరూ కలిసి త్వరలో సినిమా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్తున్నారు అనిపిస్తుంది. మోహన కృష్ణ ప్రస్తుతం సుదీర్ బాబు - నాని కాంబోలో 'వి' మూవీ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'వి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఉగాది కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
Tags:    

Similar News