• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వకీల్ సాబ్ 2' కి...

'వకీల్ సాబ్ 2' కి ప్రయత్నాలు జరుగుతున్నాయా..?

By - Tupaki Desk
Update: 2021-05-07 07:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా వచ్చిన 'వకీల్ సాబ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. మూడు వారాలు థియేటర్స్ లో ప్రదర్శించబడిన ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాని డీల్ చేసిన విధానం నచ్చి వేణు శ్రీరామ్ కు పవన్ మరో అవకాశం ఇచ్చాడని.. దిల్ రాజు కూడా పవన్ కు ఇంకో చిత్రానికి అడ్వాన్స్ ఇచ్చారని టాక్ వినిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ - శ్రీరామ్ వేణు - దిల్ రాజు కాంబినేషన్ లో 'వకీల్ సాబ్ 2' అనే న్యూస్ తెరపైకి వచ్చింది.

'వకీల్ సాబ్' క్యారక్టర్ తీసుకొని ఈ చిత్రానికి సీక్వెల్ సినిమా చేస్తే బాగుంటుందని పవర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ సైతం 'వకీల్ సాబ్-2' ఉంటుందని హింట్ ఇచ్చారు. సీక్వెల్ చేయాలనే ఆలోచన ముందుగా తనకు రాలేదని.. కానీ చాలామంది తనను 'వకీల్ సాబ్' కు సీక్వెల్ చేయమని అడుగుతున్నారని వేణు శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్ళు అడిగిన తర్వాత కొత్త ఆలోచన వచ్చిందని.. వకీల్ సాబ్ ఎవరనేది ఫిక్స్ కాబట్టి మంచి స్టోరీ రెడీ చేయాలని దర్శకుడు తెలిపారు.

'పింక్' రీమేక్ గా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు నేపథ్యంలో కోర్టు డ్రామాగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందింది. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని వేణు శ్రీరామ్ కొన్ని కమర్షియల్ హంగులు జత చేసాడు. ఒకవేళ ఇప్పుడు 'వకీల్ సాబ్' సీక్వెల్ తీసే అవకాశం వస్తే చేయగలనని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వేణు. మరి రాబోయే రోజుల్లో 'వకీల్ సాబ్ 2' దిశగా అడుగులు పడతాయేమో చూడాలి.
Tags:    
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Vakeel Saab Collections 
  • Dil Raju 
  • Telugu News 
  • Ss Thaman 
  • Dil Raju 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS