శ్రుతి.. ఈ ప్ర‌యోగాల వెన‌క శంత‌ను ఉన్నాడా?

Update: 2021-06-03 03:30 GMT
గ‌త కొంత‌కాలంగా వీర్డ్ ఫోటోగ్ర‌ఫీతో శ్రుతి హాస‌న్ ప్ర‌యోగాల గురించి తెలిసిందే. కాస్త వింత‌గా వికృతంగా క‌నిపించ‌డం ఈ ఫోటోగ్ర‌ఫీ ప్ర‌త్యేక‌త‌. ఇది పాశ్చాత్య ధోర‌ణితో సంగ‌మం అని శ్రుతి ఇంత‌కుముందే వెల్లడించారు. రొటీనిటీ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తాను ఇలాంటి ప్ర‌యోగాల్ని ఇష్ట‌ప‌డ‌తాన‌ని తెలిపింది.

డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను జ‌త‌గాడ‌య్యాక శ్రుతి ప్ర‌యోగాలు మ‌రింత‌గా శ్రుతి మించుతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. ఇక ఇటీవ‌ల మేక‌ప్ ప‌రంగా హెయిర్ స్టైల్స్ అలాగే లుక్ ప‌రంగా ర‌క‌ర‌కాల ప్ర‌యోగాల‌తో వీర్డ్ స్క్వేర్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంటే అవ‌న్నీ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారుతున్నాయి.

తాజాగా శ్రుతి ఆర్టిస్టిక్ లుక్ తో క‌నిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో శంత‌ను ఆర్ట్ ఫ్రేమ్స్ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. శ్రుతి బ్లూ టాప్ ధ‌రించి పింక్ లిప్స్ పింక్ ఫౌండేష‌న్ ముఖ ఛాయ‌తో త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది. తీర్చిదిద్దిన ఆ అంద‌మైన క‌ళ్లు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి. ఈ ఫోటో మునుప‌టి ప్ర‌యోగాల‌తో పోలిస్తే కొంత ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తోంది. ఇదంతా శంత‌ను ప్ర‌యోగాల మాయో ఏమో! అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. డూడుల్ ఆర్టిస్ట్ శంత‌నుతో స్నేహంలో ఉన్న శ్రుతి అత‌డితో క‌లిసి నిరంత‌రం ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తోంద‌నే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే క్రాక్ - వ‌కీల్ సాబ్ తో గ్రేట్ కంబ్యాక్ సాధ్య‌మైంది. త‌దుప‌రి పాన్ ఇండియన్ మూవీ స‌లార్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రుతి క‌నిపించ‌నుంది.
Tags:    

Similar News