ఉస్తాద్‌ తో బుట్టబొమ్మ రొమాన్స్ లేనట్లేనా?

Update: 2022-12-14 08:30 GMT
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న చిత్రం టైటిల్ మారింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గా మారిన విషయం తెల్సిందే. టైటిల్‌ మార్చడంతో పాటు మొత్తం కథ కూడా మారిందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హీరోయిన్ కూడా మారిందట.

భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన సమయంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ పలు సందర్భాల్లో మాట్లాడుతూ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

తాను మరోసారి పూజా తో వర్క్ చేయబోతున్నట్లుగా చెప్పడం తో అంతా కూడా పవన్ మరియు పూజా రొమాన్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబో సినిమా యొక్క హీరోయిన్ పూజా హెగ్డే కాదని మైత్రి మూవీ మేకర్స్ నుండి వార్తలు వస్తున్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో పూజా హెగ్డే కనిపించలేదు.. సరే ఆమె బిజీగా ఉంది అనుకుందా.. చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌ లో కూడా హీరోయిన్ పేరు చేర్చలేదు.
Read more!

పూజా హెగ్డే పేరును కనీసం ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా వేదికలపై మైత్రి మూవీ మేకర్స్ వారు కానీ హరీష్ శంకర్‌ కానీ జత చేయలేదు. ఆమెను ట్యాగ్‌ చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమాలో ఆమె నటిస్తుందనే అభిప్రాయం ఉండేది.

కానీ పవన్‌ కళ్యాణ్ సినిమా ఉస్తాద్‌ భగత్‌ సింగ్ లో ఆమె లేదు కనుక ఆమె ప్రస్తావన లేదు అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News